TS Covid 19: తెలంగాణలో తగ్గని కరోనా వైరస్.. కొత్తగా 621 కేసులు నమోదు, ప్రస్తుతం 9 వేల యాక్టివ్ కేసులు

Balaraju Goud

Balaraju Goud |

Updated on: Jul 31, 2021 | 8:47 PM

తెలంగాణలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే, పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టిన జిల్లాల్లో కాస్త పెరుగుతుండటం కాస్త ఆందోళన కలిగిస్తోంది.

TS Covid 19: తెలంగాణలో తగ్గని కరోనా వైరస్.. కొత్తగా 621 కేసులు నమోదు, ప్రస్తుతం 9 వేల యాక్టివ్ కేసులు
Corona

Telanganan coronavirus Cases: తెలంగాణలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే, పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టిన జిల్లాల్లో కాస్త పెరుగుతుండటం కాస్త ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 621 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,44,951కి పెరిగాయి. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.

ఇదిలావుంటే, కరోనా మహమ్మారి బారిన కారణంగా మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం 3,802 మంది వైరస్ బారిన పడి ప్రాణాలను కోల్పోయారు. ఇక, ఒక్క రోజు వ్యవధిలో వైరస్‌ బారినపడిన వారిలో 691 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు మొత్తం 6,32,080 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కాగా, ప్రస్తుతం వివిధ ఆసుపత్రులతో పాటు మొత్తంగా ఇంకా 9069 యాక్టివ్‌ కేసులున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తన నివేదకలో వెల్లడించింది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 1,13,012 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు పేర్కొంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 2,20,06,215 నమూనాలను పరీక్షించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మరోవైపు కోవిడ్ నివారణ చర్యల్లో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది.

జిల్లాల వారీగా నమోదైన కేసులు ఇలా ఉన్నాయి… 

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu