Police: ఆంధ్ర-తెలంగాణ సరిహద్దు పోలీస్ స్టేషన్లకు కొత్త సమస్యలు.. తలలు పట్టుకుంటున్న ఇరు రాష్ట్రాల పోలీసులు

Balaraju Goud

Balaraju Goud |

Updated on: Jul 31, 2021 | 8:12 PM

ఆంధ్ర తెలంగాణ బోర్డర్ పోలీస్ స్టేషన్లకు కొత్త తలనొప్పులు తప్పడంలేదు. సాధారణ కేసుల కన్నా అక్రమ మద్యం రవాణాలో పట్టుపడుతున్న వాహనాలతో పోలీస్ స్టేషన్లు నిండిపోతున్నాయి. నా

Police: ఆంధ్ర-తెలంగాణ సరిహద్దు పోలీస్ స్టేషన్లకు కొత్త సమస్యలు.. తలలు పట్టుకుంటున్న ఇరు రాష్ట్రాల పోలీసులు
Police Seized Vehicles

Andhra-Telangana border police: ఆంధ్ర తెలంగాణ బోర్డర్ పోలీస్ స్టేషన్లకు కొత్త తలనొప్పులు తప్పడంలేదు. సాధారణ కేసుల కన్నా అక్రమ మద్యం రవాణాలో పట్టుపడుతున్న వాహనాలతో పోలీస్ స్టేషన్లు నిండిపోతున్నాయి. నాన్ డ్యూటీ పైడ్ లిక్కర్‌ను ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలోకి అనుమతించేది లేదని ప్రభుత్యం ఉత్తర్వులు జారీ చేసినా.. మార్పు మాత్రం రావడం లేదు.

ఒకవైపు స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో.. లా అండ్ ఆర్డర్ పోలీసులు ఇంకో వైపు రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో జల్లిడి పడుతున్నారు. 24 గంటలు షిఫ్తుల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది.. ఈ ఏడాదజనవరి నుండి ఇప్పటివరకు 9వేలకు పైగా కేసులు నమోదు చేశారు. అంటే, ఎంతగా లిక్కర్ స్మగ్లింగ్ జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇదే క్రమంలో అక్రమ మద్యాన్ని తరలిస్తున్న వందలాది వాహనాలను సీజ్ చేస్తున్నారు. ఇక, వాహనాల విషయానికి వస్తే జగయ్యపేట, నందిగామ, మైలవరం, తిరువూరు సర్కిల్ పోలీస్ స్టేషన్లలో కుప్పలు తెప్పలుగా పెరుకుపోతున్నాయి. ఇప్పుడిదే పోలీసు ఉన్నతాధికారులకు పెద్ద సమస్యను తెచ్చిపెడుతున్నాయి.

అనుకున్న మద్యం బ్రాండ్లు,పెరిగిన రేట్ల వల్ల ఏపీలో ఇతర రాష్ట్రాల మద్యం వైపు మందుబాబులు ఎగబడుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న కొంతమంది అక్రమ మద్యం రవాణాకు పాల్పడుతున్నారు. తెలంగాణ బోర్డర్ నుండి ఆంధ్ర బోర్డర్ లోకి తీసుకొస్తే ఒకరేటు డైరెక్ట్ గా కస్టమర్ దగ్గరకి చేర్చితే ఇంకో రేటు అని యథేచ్ఛగా అక్రమ మద్యం మాఫియా కార్యాలపాలు సాగిస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు గట్టి నిఘా పెట్టి తనిఖీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఆంధ్ర సరిహద్దు ప్రాంతాలైన జగయ్యపేట, నందిగామ, మైలవరం, తిరువూరు సర్కిళ్ల పరిధిలో చెక్ పోస్టులు పెట్టి ప్రతి వాహనాన్ని చెక్ చేసి మద్యం దొరికితే వాహనాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు.

మైలవరం నియోజకవర్గం జి.కొండూరు, రెడ్డిగూడెం, ఏ.కొండూరు లో జనవరి నుండి ఇప్పటి వరకు 1081 కేసులు నమోదు కగా 924 వాహనాలు పట్టుకున్నారు. ఇక, నందిగామ నియోజకవర్గ పరిధిలో కంచికచర్ల, చందర్లపాడు, వీరులపాడు, నందిగామ స్టేషన్లలో 1,814 కేసులో 471 వాహనాలను సీజ్ చేశారు. తిరువూరు నియోజకవర్గ పరిధిలో విసన్నపేట, చట్రాయి, గంపలగూడం, ఏ.కొండూరు ప్రాంతాల్లో ఎస్.ఈ.బీ లా అండ్ ఆర్డర్ పోలీసులు తనిఖీల్లో 3 వేల కేసుల్లో 351 మందిని అరెస్ట్ చేసి 146 వాహనాలను సీజ్ చేసినట్టు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. జగయ్యపేట నియోజకవర్గ పరిధిలోని చిల్లకల్లు, వత్సవాయి, పెనుగంచిప్రోలు, జగ్గయ్యపేట పోలిస్ స్టేషన్ల లో కేసులు 2000 వేల కేసులు నమోదు చేసి, రెండున్నర కోట్ల విలువైన మద్యాన్ని పట్టుకున్నట్లు జగయ్యపేట పోలీసులు తెలిపారు. ఇలా స్వాధీనం చేసుకున్న వాహనాలను పోలీసు స్టేషన్లకు తరలించడంతో కుప్పలు తెప్పలుగా పేరుకుపోయాయి.

తక్కువ ధరకు దొరకుతాయన్న ఆశతో మద్యం బాటిళ్లతో అడ్డంగా బుక్కై వాహనాలను పోలీసులకు అప్పచెప్పి వెళ్లిపోతున్నారు. ఒకవేళ పోలీస్ స్టేషన్ లో ఉన్న వాహనాలు కావాలంటే దానికి పెద్ద తతాంగమే ఉంది. వావానాలకు బ్రేక్ ఇన్‌స్పెక్టర్ నిర్దేశించ రుసుముకి ఇద్దరు షూరిటీ పెట్టి బ్యాంక్ లో అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు ఇందుకు సంబంధించి వినతిపత్రం పోలీసులకు సమర్పిస్తే కోర్ట్ ద్వారా వాహనాన్ని తాత్కాలికంగా అప్పచెబుతారు. ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు వాహనానికి ఎలాంటి మార్పులు చెయ్యకూడదు. ఈ తిప్పలు పడలేని వాహనాదారులు పట్టుపడ్డ వాహనాలను ఎక్కడికక్కడే వదిలేస్తున్నారు. వాహనాలు కేసులు పూర్తయ్యాక తీసుకోవచ్చులే.. వదిలేసి వెళ్లిపోతున్నారని పోలీసులు చెబుతున్నారు. ఇలా పేరుకుపోయిన వాహనాలకు ప్రత్యేక రక్షణ పెట్టాల్సి వస్తండటంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.

Read Also…

Firecracker: విరుధునగర్‌లోని బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఒకరు సజీవదహనం.. పలువురికి తీవ్ర గాయాలు

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu