Crime News: ‘రోజుకో అమ్మాయి కావాలి’.. అతడికి ఆమె కూడా సహకారం.. కిలాడీ జంట నేరచరిత్రలో విస్తుపోయే నిజాలు

Crime News Latest: 'ఒంటిపై ఆభరణాలతో కనిపించే మహిళలే ఆ కిరాతకుడి టార్గెట్. వారిని ట్రాప్ చేసి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి..

Crime News: 'రోజుకో అమ్మాయి కావాలి'.. అతడికి ఆమె కూడా సహకారం.. కిలాడీ జంట నేరచరిత్రలో విస్తుపోయే నిజాలు
Couple
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 31, 2021 | 7:58 PM

‘ఒంటిపై ఆభరణాలతో కనిపించే మహిళలే ఆ కిరాతకుడి టార్గెట్. వారిని ట్రాప్ చేసి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి నగలతో ఉడాయిస్తాడు. ఒప్పుకుంటే లైంగిక దాడి చేసేవాడు. కాదని ఎదురు తిరిగితే నరకం చూపించేవాడు. అలాగే పోలీసులకు కంప్లైంట్ చేస్తారని అనిపిస్తే కిరాతకంగా చంపేసేవాడు’.. ఇది దుండిగల్ మహిళ హత్య కేసులో ప్రధాన నేరస్తుడైన కురువ స్వామి అలియాస్ రవి(32) నేర చరిత్ర. అతడి పైశాచికత్వానికి నర్సమ్మ(30) కూడా సహకారం అందించేది.

ఈ నెల 25న దుండిగల్‌లో మహిళ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు ఐడీఏ బొల్లారం వైఎస్సార్ కాలనీకి చెందిన కురువ స్వామి అలియాస్ రవి(32), నర్సమ్మ(30)ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా.. సదురు మహిళను హత్య చేసినట్లుగా ఒప్పుకున్నారు. అంతేకాకుండా విచారణలో ఈ కిలాడీ జంట నేరచరిత్ర గురించి విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.

స్వామికి ఎప్పుడూ విలాసవంతమైన జీవితం కావాలి. ఒంటిపై ఆభరణాలు కనిపించిన మహిళలను ట్రాప్‌లోకి దింపి అత్యాచారానికి పాల్పడేవాడు. ఇదే తరహాలో తొమ్మిదేళ్ల క్రితం నర్సమ్మపై కూడా అఘాయిత్యం చేశాడు. స్వామితో పరిచయం ఏర్పడిన తర్వాత నర్సమ్మ భర్త, పిల్లలను వదిలేసి అతడితో కొన్నేళ్ళు సహజీవనం చేసింది. ఆ తర్వాత అతన్ని పెళ్లి చేసుకుంది. మహిళల దగ్గర నుంచి కొట్టేసిన నగలను కుదవపెట్టి.. అలా వచ్చిన డబ్బులతో 15 రోజులు జులాయిగా తిరిగేవాడు. ఆ డబ్బు అయిపోగానే మరో మహిళపై దారుణానికి ఒడిగట్టేవాడు. ఎవరికీ అనుమానం రాకుండా రెండు నెలలకు ఒకసారి మకాం మార్చేవాళ్ళమని ఆ కిలాడీ జంట పోలీసులు చెప్పారు. దుండిగల్ మహిళ కూడా స్వామి బాధితురాలే. పరువు పోతుందన్న ఉద్దేశంతో చాలామంది బాధిత మహిళలు ఫిర్యాదు చేయలేదని పోలీసులు అన్నారు.