JC Vs Pedda Reddy: తాడిపత్రి వార్: తాజాగా పెట్టిన కొత్త కేసుపై సంచలన కామెంట్స్ చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి
అనంతపురం జిల్లా తాడిపత్రి రాజకీయాలు ఎక్కడా వేడి తగ్గడం లేదు. తాజాగా టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై మరోసారి కేసు నమోదైంది. ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై మీసం తిప్పుతూ..
Tadipatri – Pedda Reddy – JC Prabhakar Reddy: అనంతపురం జిల్లా తాడిపత్రి రాజకీయాల్లో ఎక్కడా వేడి తగ్గడం లేదు. తాజాగా టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై మరోసారి కేసు నమోదైంది. ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై మీసం తిప్పుతూ సవాళ్లు విసిరిన జేసీపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు వైసీపీ నాయకులు రామ్మోహన్ రెడ్డి, ఓబుల రెడ్డి. దీంతో పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డి మీద 153ఏ, 506 ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అయితే, తనపై కేసు పెట్టడాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. “తాను మీసం తిప్పితే కేసు పెడుతారా..? ఇటువంటి వాటికి భయపడే ప్రసక్తే లేదు. గతంలో పెద్దారెడ్డి చేసిన వాటిపై ఫిర్యాదు చేసే ఎందుకు పెట్టలేదు.? పూర్వం జుట్టు పెంచితే పన్నులు వేసే వారు, ఇప్పుడు మీసం తిప్పితే కేసులు పెడుతున్నారు.” అని జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాను మళ్లీ జైలుకు వెళ్లడానికి సిద్ధమంటూ ఇవాళ టీవీ9తో చెప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. మరోసారి మీసం తిప్పి చూపించారు. తాను హైఫై లైఫ్ చూశానని.. ఇప్పుడు నేలపై పడుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని జేసీ తేల్చి చెప్పారు.