Kondapalli Mining: ఆయన డైరెక్షన్‌లో గొడవలు.. కీలక విషయాలు తెలిపిన వైసీపీ ఎమ్మెల్యే..
Kondapalli Mining: కొండపల్లి మైనింగ్ వివాదంలో టీడీపీ నేతల వ్యవహార శైలిపై వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తీవ్రస్థాయిలో..
Kondapalli Mining: కొండపల్లి మైనింగ్ వివాదంలో టీడీపీ నేతల వ్యవహార శైలిపై వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ అంశంపై దేవినేని ఉమామహేశ్వరరావు అతి చేశారంటూ ధ్వజమెత్తారు. శనివారం నాడు ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. దేవినేని ఉమ కనుసన్నల్లో, డైరెక్షన్‌లోనే దాడి జరిగిందని ఆరోపించారు. దేవినేని ఉమ కారులో ఎనిమిది గంటలు కూర్చోని.. తన అనుచరులకు ఫోన్లు చేసి పిలిపించారని అన్నారు. గొడవలు జరుగుతున్నాయని తెలిసి.. తమ కార్యకర్తలను అక్కడి నుంచి వెనక్కి రావాలని పిలిచానని అన్నారు. అంతేకాదు.. తమ కారుపై దాడి జరిగితే.. ఉమ కారుపై దాడి జరిగిందని దుష్ప్రచారం చేస్తున్నారని వసంత కృష్ణ ఫైర్ అయ్యారు. అంతేకాదు.. తమ దళితులను కొట్టారు కనుకే.. ప్రశ్నించడానికి దళితులు వచ్చారని వసంత కృష్ణ పేర్కొన్నారు. దళితులను కొట్టారు కాబట్టే దేవినేనిపై కేసు పెట్టారని అన్నారు.
ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు గతంలో దళితులపై చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే వసంత కృష్ణ ఉటంకిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. దళితుల్లో పుట్టాలని ఎవరు మాత్రం కోరుకుంటారని చంద్రబాబు చేసిన కామెంట్స్‌ని వసంత కృష్ణ ప్రసాద్ గుర్తు చేశారు. చంద్రబాబు వాస్తవాలు తెలుసుకోకుండా తప్పులు చేసిన వారిని సమర్థిస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. తాము ఎవరినీ అడ్డుకోలేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అక్రమ మైనింగ్‌పై నిజ నిర్ధారణ జరగాల్సిందేనని అన్నారు. అయితే, టీడీపీ నేతలు వెళ్లి ఏం చేస్తారు? ఏం సాధిస్తారు? అంటూ ప్రశ్నలు గుప్పించారు. అధికారులు త్వరలోనే అన్ని వాస్తవాలు తేలుస్తారని అన్నారు. మైనింగ్ విషయంలో 2018లో మంత్రి కేఈ కృష్ణమూర్తి స్టే ఇచ్చారని ఎమ్మెల్యే వసంత కృష్ణ గుర్తు చేశారు.
Also read:
Govt Pensioners: ప్రభుత్వ పెన్షనర్లకు గుడ్ న్యూస్.. 3.144 శాతం మేర డీఏ పెంచిన సర్కార్..
Kondapalli Mining: తెలుగుదేశం పార్టీని ఏదో చేయాలని చూస్తున్నారు.. సంచలన ఆరోపణలు చేసిన చంద్రబాబు