Govt Pensioners: ప్రభుత్వ పెన్షనర్లకు గుడ్ న్యూస్.. 3.144 శాతం మేర డీఏ పెంచిన సర్కార్..

Govt Pensioners: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పెన్షనర్లకు శుభవార్త. పెన్షనర్లకు 3.144 శాతం మేర డీఏ పెంచింది రాష్ట్ర ప్రభుత్వం.

Govt Pensioners: ప్రభుత్వ పెన్షనర్లకు గుడ్ న్యూస్.. 3.144 శాతం మేర డీఏ పెంచిన సర్కార్..
Da Hike
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 31, 2021 | 6:51 PM

Govt Pensioners: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పెన్షనర్లకు శుభవార్త. పెన్షనర్లకు 3.144 శాతం మేర డీఏ పెంచింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన 3.144 శాతం కరువు భత్యాన్ని 2019 జనవరి 1వ తేదీ నుంచి వర్తింపజేస్తూ నిర్ణయించారు. కాగా, కొత్త పెంపుతో పెన్షనర్ల కరువు భత్యం 33.536 శాతానికి పెరిగింది.

2021 జులై నెల నుంచి పెంపుదల చేసిన డీఏతో కలిసి ఫించన్లు చెల్లించనున్నట్లు ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది. అంతేకాదు.. బకాయి ఉన్న డీఏను వాయిదాల్లో చెల్లించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 2019 జూలై నుంచి పెంచాల్సిన మూడో డీఆర్ 5.24 శాతాన్ని.. 2022 జనవరి నెల నుంచి చెల్లించనున్నట్టు రాష్ట్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఇక 2018 జూలై 1 తేదీన 27.248 శాతం నుంచి 30.392 శాతానికి పెన్షనర్ల డీఏ పెంపుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2019 జూలై నుంచి 5.24 శాతం మేర మూడో డీఆర్ పెంచింది. ఈ పెంపుతో మొత్తం 38.776 శాతానికి పెన్షనర్ల డీఏ పెరిగినట్లయ్యింది. ఇదిలాఉంటే.. వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేసిన పెన్షనర్లకు సవరించిన కరవు భత్యం రేట్లను సవరిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఉత్తర్వులు జారీ చేశారు.

Also read:

AP Corona Cases: ఏపీలో స్థిరంగా పాజిటివ్ కేసులు.. దడ పుట్టిస్తున్న ‘డెల్టా’.. జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు..!

Kondapalli Mining: తెలుగుదేశం పార్టీని ఏదో చేయాలని చూస్తున్నారు.. సంచలన ఆరోపణలు చేసిన చంద్రబాబు

Independence Day: తీవ్ర విషాదం.. భగత్ సింగ్‌లా నటిస్తూ ఉరికొయ్యకు బలైన చిన్నారి..