Murder: అల్లుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న అత్త.. భర్త అడ్డుగా ఉన్నాడని.. చిత్తూరులో దారుణం.

Murder: సమాజంలో జరుగుతోన్న కొన్ని సంఘటనలు చూస్తుంటే మనుషుల్లో అసలు విలువలు అనేవి ఉన్నాయా? అన్న ప్రశ్నలు తలెత్తుతుంటాయి. వావి వరస మరిచి కొందరు చేస్తోన్న పనులు...

Murder: అల్లుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న అత్త.. భర్త అడ్డుగా ఉన్నాడని.. చిత్తూరులో దారుణం.
Murder In Ap
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 01, 2021 | 11:11 AM

Murder: సమాజంలో జరుగుతోన్న కొన్ని సంఘటనలు చూస్తుంటే మనుషుల్లో అసలు విలువలు అనేవి ఉన్నాయా? అన్న ప్రశ్నలు తలెత్తుతుంటాయి. వావి వరస మరిచి కొందరు చేస్తోన్న పనులు చూస్తుంటే సమాజం ఏటు వైపు వెళుతోందన్న భావన రాకమానదు. ఊహించుకోవడానికి కూడా ఒళ్లు జలదరించే ఇలాంటి ఓ సంఘటన తాజాగా చిత్తూరు జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా ఐరాల మండలం రంగయ్య చెరువుకు చెందిన నాగరాజు (51), మంజులకు రాణి అనే కూతురు ఉంది. గతకొన్నేళ్ల క్రితం రాణిని బంగారుపాళ్యం మండలం చిట్టేరికి చెందిన సుబ్రహ్మణ్యానికి ఇచ్చి వివాహం చేశారు. ఈ క్రమంలోనే అల్లుడు సుబ్రమణ్యంతో మంజులు కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం పెట్టుకుంది. గుట్టు చప్పుడుకుండా వీరిద్దరూ తమ బంధాన్ని కొనసాగించారు.

ఈ క్రమంలోనే వారం రోజుల క్రితం మంజుల.. సోమల మండలం ఇర్లపల్లెలో కాపురం ఉంటున్న కుమార్తె రాణి ఇంటికి వెళ్లింది. అనంతరం మంజులాను తిరిగి తీసుకెళ్లేందుకు గత ఆదివారం భర్త నాగరాజు ఇర్లపల్లెకు వెళ్లాడు. ఈ సమయంలోనే తమ వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్న భర్తను లేకుండా చేయాలని భార్య, అల్లుడు ఓ పథకం వేశారు. అనుకున్న ప్లాన్‌ ప్రకారం.. ఇద్దరూ కలిసి నాగరాజును కంచెంవారిపల్లె సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లారు. అనంతరం ఫుల్లుగా మద్య తాగించి.. కర్రలు, రాళ్లతో దారుణంగా దాడి చేశారు. అనంతరం నాగరాజు మరణించినట్లు నిర్ధారణ చేసుకొని చంపి వడ్లవాణి కుంటలో పడేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. నీటిలో తేలుతున్న శవాన్ని స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ తెలిపారు. విచారణలో క్రమంలో భార్యను ప్రశ్నించగా అనుమానం రావడంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టడంతో నిజం బయటపడింది. నిందితులు మంజుల, సుబ్రహ్మణ్యాన్ని నెల్లిమంద వీఆర్వో సమక్షంలో శనివారం అరెస్ట్‌ చేసి రిమాండుకు పంపించారు. మూడు రోజుల్లో కేసు ఛేదించిన ఎస్సై లక్ష్మీకాంత్‌ను సీఐ అభినందించారు.

Also Read: Fake jobs scam: ఉద్యోగాల పేరుతో కిలాడీ చీటింగ్‌.. కోట్లు కొట్టేసి జంప్ అయ్యేందుకు ప్లాన్‌.. కానీ అక్కడే దొరికింది

Cyber Crime: హైదరాబాద్‌లో మరో కొత్త రకం సైబర్‌ మోసం.. పీఎం సహాయ నిధి పేరుతో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌కు కుచ్చు టోపీ.

Hyderabad: నాపై కూర్చొని.. కాళ్లు, చేతులు కట్టేశారు.. టీవీ9తో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి..