Hyderabad: నాపై కూర్చొని.. కాళ్లు, చేతులు కట్టేశారు.. టీవీ9తో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి..

Hyderabad: స్నేహితుల ముసుగులో వచ్చారు.. మంచి నీళ్లు కావాలంటూ అడిగారు.. వెనుక నుంచి దాడి చేశారు.. చేతులు, కాళ్లు కట్టేశారు..

Hyderabad: నాపై కూర్చొని.. కాళ్లు, చేతులు కట్టేశారు.. టీవీ9తో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి..
Kidnap

Hyderabad: స్నేహితుల ముసుగులో వచ్చారు.. మంచి నీళ్లు కావాలంటూ అడిగారు.. వెనుక నుంచి దాడి చేశారు.. చేతులు, కాళ్లు కట్టేశారు.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ని తీవ్రంగా కొట్టారు. ఆ తరువాత అందిన కాడికి దోచుకెళ్లారు. ఇప్పుడు మనం చెప్పుకునే స్టోరీ.. సినిమాలో జరిగిన కథ కాదు.. రియల్ లైఫ్‌లో.. హైదరాబాద్ నగరంలో జరిగిన రియల్ లైఫ్ కహానీ.

వివరాల్లోకెళితే.. చందానగర్‌ హుడా కాలనీ దగ్గర ఇంజినీర్స్‌ ఎన్‌క్లేవ్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మామిళ్లపల్లి శ్రీహర్ష, సోలార్‌ ఇంజినీర్‌గా పనిచేసే అతని స్నేహితుడు సాయిరాం ప్రసాద్‌తో కలిసి ఉంటున్నాడు. అయితే, గురువారం నాడు రాత్రి 7గంటల సమయంలో శ్రీహర్ష ఒక్కడే రూమ్‌లో ఉన్నాడు. ఇంతలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి తలుపు తట్టారు. ఎవరో తెలిసిన వ్యక్తులో.. ఫ్రెండ్సో అనుకుని శ్రీహర్ష డోర్ తెరిచాడు. రూమ్ మేట్ కోసం వచ్చామని చెప్పడంతో వారిని నవ్వుతూ పలకరించాడు. సాదరంగా లోపలికి ఆహ్వానించి.. లోపల కూర్చోబెట్టాడు. ఎత్తుగా ఉన్న వ్యక్తి లేడా..? అతనితో బిజినెస్ డీల్ మాట్లాడాలని అడిగారు. ఏమో.. ప్రసాద్‌కు తెలిసిన వ్యక్తులు కాబోలు అని.. వాళ్లతో శ్రీ హర్ష మరింతగా మాట కలిపాడు. సాయిరాం ప్రసాద్ లేడు.. బయటకు వెళ్లాడు.. కాసేపట్లో వస్తాడంటూ వారికి బదులిచ్చాడు.

మాటలు జరుగుతుండగానే.. వాళ్లిద్దరిలో ఒకరు మంచినీళ్లు అడిగాడు. నీళ్ల కోసం కిచెన్‌లోకి వెళ్తుండగా.. ఆ దుండగుల్లో అప్పటి దాకా నిద్రపోతున్న క్రిమినల్ ఒక్కసారిగా బయటకు వచ్చాడు. నీళ్ల కోసం వెళ్తున్న శ్రీహర్షను వెంబడించి.. వెనుక నుంచి చేతులు పట్టుకుని గోడకేసి కొట్టారు. బలంగా కొట్టడంతో దిమ్మతిరిగి కిందపడిపోయాడు శ్రీహర్ష. ఆ వెంటనే కాళ్లు, చేతులు తీగలతో కట్టేశారు. అరవకుండా.. నోట్లో గుడ్డలు కుక్కారు. ఇద్దరూ రౌండప్ చేసి.. చితకబాదారు.

ల్యాప్‌టాప్, రెండు సెల్‌ఫోన్లు మాయం..
మాతో పెట్టుకుంటే చస్తావ్.. మా అన్న జోలికి వస్తే ఇక నీ శాల్తీ ఖల్లాసే అంటూ వార్నింగ్ ఇచ్చారు. తలకు తీవ్రంగా దెబ్బతగలడం.. చేతులు, కాళ్లు కట్టేయడంతో ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో శ్రీహర్ష ఉండిపోయాడు. ఆ తర్వాత రూమ్ మొత్తం సోధించిన కేటుగాళ్లు.. ఓ ల్యాప్‌టాప్, రెండు సెల్‌ఫోన్లు తీసుకెళ్లారు. ఏటీఎం కార్డుతో పాటు 3,500 రూపాయలు క్యాష్ తీసుకుని అక్కడి నుంచి ఉడాయించారు.

వెనుక డోర్ నుంచి లోపలికి వెళ్లిన సాయిరాం
ఆ తర్వాత కాసేపటికి శ్రీహర్ష ఫ్రెండ్ సాయిరాం రూమ్‌కి వచ్చాడు. ఎన్ని సార్లు కాలింగ్ బెల్ కొట్టినా డోర్ తీయలేదు. ఫోన్ చేసినా రెస్పాన్స్ లేదు. అక్కడి పరిస్థితులు చూస్తే ఏదో అనుమానంగా ఉన్నాయి. దీంతో వెంటనే వెనుక డోర్ నుంచి సాయిరాం లోపలికి వెళ్లాడు. తీరా లోపల తన ఫ్రెండ్ ఉన్న పరిస్థితిని చూసి ఒక్కసారిగా సాయిరాం షాక్‌కు గురయ్యాడు. వెంటనే కట్లు విడిపించి.. ఆస్పత్రికి తరలించాడు. ఆ తర్వాత చందానగర్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.

ఇదిలాఉండగా.. ఈ సీన్‌కు సరిగ్గా రెండు వారాల క్రితం అదే ఏరియాలో ఓ గొడవ జరిగింది. జులై 15న రాత్రి ఇద్దరు వ్యక్తులు మద్యం సేవించి.. కారులో వేగంగా వెళ్తున్నారు. అక్కడే ఉన్న సాయిరాం.. శ్రీహర్ష వారిని అడ్డుకున్నారు. కాలనీల్లో అంతవేగం ఏంటంటూ ప్రశ్నించారు. మాటా మాటా పెరగడంతో.. వారిపై చేయి చేసుకున్నారు. ఈ ఘటనపై ఆరోజు రాత్రే స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. ఆ రోజు గొడవపడిన వాళ్ల తాలూకూ మనుషులే.. ఇప్పుడు తన మీద దాడి చేసి ఉంటారని బాధితుడు శ్రీహర్ష ఆరోపిస్తున్నాడు. ‘ఇంట్లోకి వచ్చిన వారు.. వెనుక నుండి వచ్చి దాడి చేసి తలను బలంగా గోడకు గుద్దారు. ఆ వెంటనే కింద పడిపోవడంతో నాపై కూర్చొని నా చేతులను వెనక్కి కట్టేశారు.. నోట్లో గుడ్డలు కుక్కి గదిలోకి తీసుకెళ్ళి కట్టేశారు.’ అని శ్రీహర్ష తెలిపాడు. శ్రీహర్ష ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చుట్టుపక్కల సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు నిందితుల ఆచూకీ కనుక్కునే పనిలో పడ్డారు ఖాకీలు.

Also read:

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే వర్సెస్ సర్పంచ్.. ఎమ్మెల్యే మాట్లాడుతుండగానే..

Telangana Govt: 30 సంవత్సరాల కల నెరవేర్చిన సీఎం కేసీఆర్.. అంబరాన్నంటిన సంబరాలు..

Shilpa Shetty Defamation Suit: శిల్పా శెట్టికి ఊరట.. ఆ వీడియోలు తొలగించాలని ఆదేశించిన బాంబే హైకోర్టు..

Click on your DTH Provider to Add TV9 Telugu