Telangana Govt: 30 సంవత్సరాల కల నెరవేర్చిన సీఎం కేసీఆర్.. అంబరాన్నంటిన సంబరాలు..

Telangana Govt: ఎన్నో ఏళ్లుగా ఎదరుస్తున్న సమయం రానే వచ్చింది. 30 ఏళ్ల కల త్వరలో సాక్షాత్కారం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్..

Telangana Govt: 30 సంవత్సరాల కల నెరవేర్చిన సీఎం కేసీఆర్.. అంబరాన్నంటిన సంబరాలు..
Parigi
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 31, 2021 | 10:27 PM

Telangana Govt: ఎన్నో ఏళ్లుగా ఎదరుస్తున్న సమయం రానే వచ్చింది. 30 ఏళ్ల కల త్వరలో సాక్షాత్కారం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఒక్క సంతకం.. ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారి కళ్లలో సంతోషాన్ని నింపింది. ప్రభుత్వం నుంచి అలా ప్రకటన వెలువడటమే ఆలస్యం.. ఆ ప్రాంతంలో సంతోషం వెల్లివిరిసింది. విద్యార్థులు, అధికార పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ.. పాలాభిషేకాలు చేశారు. మరి అంతగా సంబరాలు చేసుకునే అంశం ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వికారాబాద్ జిల్లా పరిగి నియోజకర్గం పరిధిలో డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయాలంటూ 30 ఏళ్లుగా స్థానిక విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, ప్రజలు, నాయకులు ప్రభుత్వాలను కోరుతూ వస్తున్నారు. చివరికి వారి విజ్ఞప్తిపై ప్రభుత్వం దృష్టిసారించింది. ముఖ్యమంత్రి ఫోకస్ పెట్టడంతో 30 ఏళ్లుగా ఎదురు చూస్తున్న డిగ్రీ కాలేజీ మంజూరు అయ్యింది. దాంతో అక్కడి విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి పరిగి పరిధిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లేకపోవడంతో ఎంతో మంది విద్యార్థులు తమ చదువులను మధ్యలోనే నిలిపివేశారు. అయితే, ఎన్నికల సమయంలో పరిగి నియోజకవర్గంలో పర్యటించిన కేసీఆర్.. డిగ్రీ కాలేజీని మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని ఇప్పుడు నెరవేరుస్తూ.. పరిగి నియోజకవర్గం పరిధిలో డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

పరిగికి డిగ్రీ కాలేజీ మంజూరు కావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, మంత్రి సబితా ఇంద్రారెడ్డికి పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, స్థానిక విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పరిగి పట్టణంలోని అమరవీరుల చౌరస్తాలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్యకర్తలు, వివిధ కాలేజీల విద్యార్థులు భారీ స్థాయిలో పాల్గొన్నారు.

Also read:

Hanuman Birth Place: అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్థలం.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన టీటీడీ.. త్వరలో..

Shilpa Shetty Defamation Suit: శిల్పా శెట్టికి ఊరట.. ఆ వీడియోలు తొలగించాలని ఆదేశించిన బాంబే హైకోర్టు..

Baal Aadhaar card: మీ పిల్లల బయోమెట్రిక్ అప్‌డేట్ చేయలేదా? అయితే అసలుకే మోసం రావొచ్చు..