Baal Aadhaar card: మీ పిల్లల బయోమెట్రిక్ అప్‌డేట్ చేయలేదా? అయితే అసలుకే మోసం రావొచ్చు..

Baal Aadhaar card: పుట్టిన ప్రతీ చిన్నారికి బర్త్ సర్టిఫికెట్ చాలా అవసరం. దానికంటే ముఖ్యంగా ఆధార్ అవసరం. అయితే, ఇంతకాలం..

Baal Aadhaar card: మీ పిల్లల బయోమెట్రిక్ అప్‌డేట్ చేయలేదా? అయితే అసలుకే మోసం రావొచ్చు..
Baal Aadhar Card
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 31, 2021 | 10:10 PM

Baal Aadhaar card: పుట్టిన ప్రతీ చిన్నారికి బర్త్ సర్టిఫికెట్ చాలా అవసరం. దానికంటే ముఖ్యంగా ఆధార్ అవసరం. అయితే, ఇంతకాలం పుట్టిన పిల్లలకు ఆధార్ కార్డు కావాలంటే.. బర్త్ సర్టిఫికెట్ తప్పనిసరి. మరి ఈ బర్త్ సర్టిఫికెట్ లేకుండానే ఆధార్ కార్డు తీసుకోవచ్చని మీకు తెలుసా? తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి..

ఆధార్ కార్డ్.. ప్రతి ఒక్కరికి ఇది ఎంతో అవసరం. కేవైసీ మొదలు.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన, పీఎం జన్‌ధన్ యోజన, ఎల్పీజీ సబ్సిడీ ఇలా ఒకటేమిటీ.. ప్రతీ ప్రభుత్వ పథకానికి, ప్రతీ పనికి ఆధార్ తప్పనిసరి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలంటే ఆధార్ కార్డ్ ఉండాల్సిందే. ఇంత ప్రాధాన్యత ఉండి కాబట్టే అందుకే భారతదేశం ప్రత్యేక గుర్తింపు ప్రాధికార సంస్థ(UIDAI) ఇప్పుడు శిశువుకు జనన ధృవీకరణ పత్రం లేకపోయినప్పటికీ.. ఆధార్ కార్డును మంజూరు చేస్తోంది. దానికే బాల ఆధార్ కార్డ్ అని పేరు పెట్టింది.

తల్లిదండ్రులు తమకు పుట్టిన శిశువు కు ఆధార్ కార్డ్ పొందాలంటే.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సర్టిఫికెట్, తల్లిదండ్రుల ఆధార్ కార్డ్ సమర్పిస్తే సరిపోతోంది. అయితే, తల్లిదండ్రుల సమాచారం కోసం.. పిల్లలకు 5 సంవత్సరాల వయస్సు వచ్చిన తరువాత బయోమెట్రిక్ ధృవీకరణ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలా చేయకపోతే.. ఆ బాల ఆధార్ కార్డు పని చేయకుండా పోతుంది.

ఈ నేపథ్యంలోనే యూఐడీఏఐ ఒక ట్వీట్ చేసింది. దీని ద్వారా.. తల్లిదండ్రులు తమ బిడ్డ ఆధార్ కార్డుకు సంబంధించి ఏం చేయాలనే దానిపై స్పష్టమైన వివరాలు ప్రకటించింది. ‘‘బాల ఆధార్ కార్డు 5 సంవత్సరాల వయస్సు వరకు మాత్రమే ఉపయోగించబడుతుంది. ఆ వయస్సు దాటిన తరువాత పిల్లల బయోమెట్రిక్స్ అప్‌డేట్ చేయకపోతే అది నిష్క్రియంగా మారుతుంది.’’ అంటూ పేర్కొంది. అంతేకాదు.. సమీప ఆధార్ కార్డ్ సెంటర్ అడ్రస్ తెలుసుకోవడానికి యూఐడీఏఐ ఆ ట్వీట్‌లో లింక్ ఇచ్చింది. https://appointments.uidai.gov.in/easearch.aspx ద్వారా పిల్లల బయోమెట్రిక్‌లను అప్‌డేట్ చేసుకోవాలని తెలిపింది.

అంతేకాదు.. 5 సంవత్సరాల తరువా బయోమెట్రిక్ అప్‌డేట్ చేసిన తరువాత.. మళ్లీ 15 ఏళ్ల తరువాత బయోమెట్రిక్ అప్‌డేట్ చేయాలని యుఐడిఎఐ ప్రకటించింది. ‘‘మీ పిల్లల బయోమెట్రిక్‌ను ఆధార్ కార్డులో అప్‌డేట్ చేయాలని గుర్తుంచుకోండి. 5 సంవత్సరాలు, 15 సంవత్సరాల వయస్సులో ఆధార్‌ను అప్‌డేట్ చేయాలి. ఇందుకోసం ఎలాంటి రుసుం తీసుకోబడదు.’’ అని ఆ ట్వీట్‌లో పేర్కొంది.

కాగా, పిల్లలకు 5 సంవత్సరాలు నిండిన తర్వాత బయోమెట్రిక్ అప్‌డేట్ కోసం, తల్లిదండ్రులు అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు. లేకపోతే.. నేరుగా యుఐడిఎఐ లింక్ – apiments.uidai.gov.in/easearch.aspx లో లాగిన్ అవ్వడం ద్వారా తమ బిడ్డను సమీప ఆధార్ సెంటర్‌కు తీసుకెళ్లవచ్చు. AspxAutoDetectCookieSupport = 1. ఈ యుఐడిఎఐ వెబ్ లింక్‌లో లాగిన్ అయిన తర్వాత, తల్లిదండ్రులు తమ పిల్లల బాల్ ఆధార్ కార్డు బయోమెట్రిక్ అప్‌డేట్ కోసం కొన్ని సాధారణ దశలను అనుసరించాల్సి ఉంటుంది.

ఎలా అప్‌డేట్ చేసుకోవాలంటే.. 1. UIDAI ఇచ్చిన డైరెక్ట్ లింక్‌లో లాగిన్ అవ్వండి. 2. అపాయింట్‌మెంట్స్ కోసం. Uidai.gov.in/easearch.aspx?AspxAutoDetectCookieSupport=1; 3. సెలక్షన్‌లో దేనినైనా సెలక్ట్ చేసుకోవాలి. రాష్ట్రం, పోస్టల్ (పిన్) కోడ్ లేదా సెర్చ్ బాక్స్ సెలక్ట్ చేసుకోవాలి. 4. ఇచ్చిన ఆప్షన్స్‌లో ఏదైనా ఒకదాన్ని ఎంచుకున్న తర్వాత సమాచారాన్ని నింపాలి. 5. ‘లొకేట్ సెంటర్’ బటన్‌పై క్లిక్ చేయాలి.

వీటిని ఫాలో అయిన తర్వాత, తమ ప్రాంతంలో సమీప ఆధార్ కేంద్రం కనిపిస్తుంది. అలా అక్కడ అపాయింట్‌మెంట్ ఫిక్స్ చేసిన తర్వాత తల్లిదండ్రులు తమ బిడ్డతో ఆధార్ సెంటర్‌కి వెళ్లి బయోమెట్రిక్ అప్‌డేట్ చేసుకోవాలి.

Also read:

Andhra Pradesh: రామప్పకు యునెస్కో గుర్తింపు.. ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్..!

Kondapalli Mining: ఆయన డైరెక్షన్‌లో గొడవలు.. కీలక విషయాలు తెలిపిన వైసీపీ ఎమ్మెల్యే..

Govt Pensioners: ప్రభుత్వ పెన్షనర్లకు గుడ్ న్యూస్.. 3.144 శాతం మేర డీఏ పెంచిన సర్కార్..