Andhra Pradesh: రామప్పకు యునెస్కో గుర్తింపు.. ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్..!

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించిన...

Andhra Pradesh: రామప్పకు యునెస్కో గుర్తింపు.. ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్..!
Kona Raghupati
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 31, 2021 | 7:57 PM

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యల పరిష్కారానికై.. కేంద్ర మంత్రులు పశుపతి పరాస్, కిషన్ రెడ్డిలను కలిశారు. వీరితో భేటీలో ఏపీకి సంబంధించి వ్యవసాయం, టూరిజం అంశాలపై చర్చించారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముందుగా తెలంగాణలోని రామప్పకు అంతర్జాతీయ సాంస్కృతిక సంస్థ యునెస్కో గుర్తింపుపై స్పందించారు. రామప్పకు యునెస్కో గుర్తింపు రావడం పట్ల అభినదంలు తెలిపారు. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి తెలుగువాడు కావడం గర్వకారణం అని అన్నారు.

ఇదిలాఉంటే.. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముందుగా కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి పశుపతి పరాస్‌ను కలిసిన కోన రఘుపతి.. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ 74 శాతం వ్యవసాయంపై ఆధారపడిందని, ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్ట్రీ నుంచి ఉన్న పథకాలను యధావిధంగా కొనసాగించాలని కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. వ్యసాయం, ఫుడ్ ప్రాసెసింగ్‌ రంగాలకు ఇస్తున్న ప్రాధాన్యతను కేంద్ర మంత్రికి వివరించామని కోన రఘుపతి తెలిపారు. ఇదే సమయంలో పోలవరం ప్రాజెక్టు పురోగతిపై కేంద్ర మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారని అన్నారు.

ఇక కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కలిసి.. ఏపీలో పర్యాటక, సాంస్కృతి రంగాల అభివృద్ధికి కృషి చేయాలని కోరామన్నారు. ఆగస్టు 6, 7వ తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌కు వస్తానని కిషన్ రెడ్డి తెలిపారని అన్నారు. సూర్యలంక టూరిజం సహా క్షీర భావనారయణ స్వామి దేవాలయం అబివృద్ధి కోసం త్వరలో డీపీఆర్ సమర్పిస్తామని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి తెలిపారు. భవిష్యత్‌లో ఆంధ్రప్రదేశ్ టూరిజం హబ్‌గా మారబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, తమ ప్రతిపాదనలకు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి సానుకూలంగా స్పందించారని రఘుపతి తెలిపారు. ఇదే సమయంలో ‘దిశ’ బిల్లుపై కోణ రఘుపతి స్పందించారు. మహిళల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘దిశ’ బిల్లును తీసుకువచ్చిందన్నారు. ప్రోసీజల్ ప్రాసెస్ కారణంగా దిశ బిల్లు కేంద్రం వద్ద ఆలస్యం అవుతుందని భావిస్తున్నానని అన్నారు.

Also read:

Kondapalli Mining: ఆయన డైరెక్షన్‌లో గొడవలు.. కీలక విషయాలు తెలిపిన వైసీపీ ఎమ్మెల్యే..

Govt Pensioners: ప్రభుత్వ పెన్షనర్లకు గుడ్ న్యూస్.. 3.144 శాతం మేర డీఏ పెంచిన సర్కార్..

AP Corona Cases: ఏపీలో స్థిరంగా పాజిటివ్ కేసులు.. దడ పుట్టిస్తున్న ‘డెల్టా’.. జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు..!