Fake jobs scam: ఉద్యోగాల పేరుతో కిలాడీ చీటింగ్‌.. కోట్లు కొట్టేసి జంప్ అయ్యేందుకు ప్లాన్‌.. కానీ అక్కడే దొరికింది

నిరుద్యోగ యువతలోని అమాయకత్వమే వారి పెట్టుబడి. బ్యాక్ డోర్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొన్ని ముఠాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగులకు కుచ్చు టోపీ...

Fake jobs scam: ఉద్యోగాల పేరుతో కిలాడీ చీటింగ్‌.. కోట్లు కొట్టేసి జంప్ అయ్యేందుకు ప్లాన్‌.. కానీ అక్కడే దొరికింది
Fake Jobs Scam
Follow us

|

Updated on: Aug 01, 2021 | 9:27 AM

నిరుద్యోగ యువతలోని అమాయకత్వమే వారి పెట్టుబడి. బ్యాక్ డోర్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొన్ని ముఠాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగులకు కుచ్చు టోపీ పెడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి నకిలీ అపాయింట్ మెంట్ లెటర్లు చూపించే సరికి నిరుద్యోగ యువత వారిని నమ్మి మోసపోతున్నారు. ఇలా ఉద్యోగాలు రాక ముందే బాధల్లో ఉన్న నిరుద్యోగ యవతను మరింత కష్టాల్లోకి నెడుతున్నారు. నిరుద్యోగ యువత అమాయకత్వమే పెట్టుబడిగా మార్చుకుని కొందరు మోసగాళ్లు ఈ దందా నడుపుతున్నారు.

విజయనగరం జిల్లాలో ఉద్యోగాల పేరిట మోసాలకు పాల్పడుతున్న కిలాడి లేడిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఉద్యోగాలు ఇప్పిస్తానని యువతను మోసం చేసి లక్షలు కొట్టేసింది మహిళ. బొబ్బిలి మండలం రాముడు వలసకు చెందిన గుంటా విజయరాణిపై ఫిర్యాదులు రావడంతో అరెస్ట్‌ చేశారు నిందితురాలు గుంటా విజయరాణి.. మంత్రులు, ఉన్నతాధికారుల పేర్లు చెప్పి ఉద్యోగాల పేరిట యువతకు గాలం వేసింది.

దాదాపు సుమారు రెండు కోట్ల మేర వసూలు చేసి మొహం చాటేసింది. కొద్ది రోజులుగా విజయరాణి కోసం బాధితులు గాలిస్తున్నారు. అకస్మాత్తుగా బొబ్బిలి లో ప్రత్యక్షమవ్వటంతో విజయరాణి ని చుట్టుముట్టిన భాదితులు.. నిందితురాలిని పట్టుకున్నారు. వెంటనే డబ్బులు ఇవ్వాలని ఆవేశంతో నిందితురాలిపై దాడి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకొని మాయలేడీ విజయరాణిని అదుపులోకి తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి: Telangana Cabinet: ఇవాళ తెలంగాణ కేబినెట్‌ సమావేశం..హుజురాబాద్‌ ఉప ఎన్నికపైనా ఫోకస్.. దళిత బంధు.. 50 వేల ఉద్యోగాలపై చర్చ

Chanakya Niti: ఈ అలవాట్లకు దూరంగా ఉంటే మీరు కోటీశ్వరులు కావచ్చు.. చాణక్యుడు చెప్పిన పెద్ద రహస్యం