జమ్మూలోని ప్రాంతాల్లో మళ్ళీ డ్రోన్ల కలకలం..సెక్యూరిటీ వర్గాల్లో కలవరం.. పెరిగిన నిఘా

జమ్మూ లోని ప్రాంతాలలో మళ్ళీ డ్రోన్లు కలకలం సృష్టిస్తున్నాయి. శనివారం రాత్రి ఈ జిల్లాలోని డోమానా లోను, సాంబా జిల్లాలోనూ డ్రోన్లవంటివి కనిపించినట్టు స్థానికులు తెలిపారు.

జమ్మూలోని ప్రాంతాల్లో మళ్ళీ డ్రోన్ల కలకలం..సెక్యూరిటీ వర్గాల్లో కలవరం.. పెరిగిన నిఘా
Drone

జమ్మూ లోని ప్రాంతాలలో మళ్ళీ డ్రోన్లు కలకలం సృష్టిస్తున్నాయి. శనివారం రాత్రి ఈ జిల్లాలోని డోమానా లోను, సాంబా జిల్లాలోనూ డ్రోన్లవంటివి కనిపించినట్టు స్థానికులు తెలిపారు. కొన్ని గంటల వ్యవధిలో మూడు సార్లు వీటిని తాము చూసినట్టు వారు తెలిపారు. మొదట సాంబా జిల్లాలో గత రాత్రి 8-9 గంటల మధ్య రెండు డ్రోన్ల వంటివి కనిపించాయని.. తక్కువ వెలుతురులో ఎగురుతున్న తాను వీటిని తన సెల్ లో వీడియోగా చిత్రీకరించానని స్థానికుడొకరు తెలిపారు. ఆ తరువాత డోమానా జిల్లాలో రాత్రి 9 గంటల 50 నిముషాల ప్రాంతంలో తాను కూడా ఈ విధమైన వస్తువును చూసి తన మొబైల్ లో చిత్రీకరించానని, మూడు నిముషాలకే ఆ వస్తువు కంపించకుండా పోయిందని ఈ జిల్లా వాసి ఒకరు చెప్పారు. వీరు ఈ విషయాన్నీ భద్రతా దళాల దృష్టికి తీసుకు వెళ్లగా సెక్యూరిటీ అధికారులు వెంటనే గాలింపు ప్రారంభించారు.

అయితే ఇవి డ్రోన్లు అయి ఉండవచ్చునని చెప్పలేమని అధికారులు పేర్కొన్నారు. నిజానికి జమ్మూ సహా శ్రీనగర్ తదితర ప్రాంతాల్లో ఎగిరే వస్తువులను ప్రభుత్వం నిషేధించింది. జమ్మూ లోని ఎయిర్ బేస్ వద్ద డ్రోన్లను కనిపెట్టడానికి తగిన వ్యవస్థలు ఉన్నా అవి ఈ తాజా వస్తువులను కనిపెట్టలేకపోయాయి. ఇక్కడ జామర్లు, యాంటీ డ్రోన్ సిస్టం లను ప్రభుత్వం గత నెల మొదటివారంలోనే ఏర్పాటు చేసింది. దేశ స్వాతంత్య్ర దినోత్సవం సమీపిస్తున్న సందర్భంగా అత్యంత అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం అప్పుడే భద్రతా దళాలను ఆదేశించినట్టు ఈ వర్గాలు వెల్లడించాయి. పాక్ ఉగ్రవాదులు ఏ క్షణమైనా మళ్ళీ డ్రోన్లను వినియోగించడానికి సిద్ధంగా ఉన్నట్టు వార్తలు అందుతున్నాయి.

 

మరిన్ని ఇక్కడ చూడండి: How to get a Kiss: ముద్దు ఎలా పెట్టుకోవాలో ఈ కుందేళ్ల నుంచి తెలుసుకోండి.. ఈ అందమైన వీడియో చూసిన తర్వాత మీరేమంటారు..

మహారాష్ట్రలో తొలి జికా వైరస్ కేసు.. పలు జిల్లాల్లో ఆరోగ్య శాఖ అధికారుల సర్వేలు

Click on your DTH Provider to Add TV9 Telugu