మహారాష్ట్రలో తొలి జికా వైరస్ కేసు.. పలు జిల్లాల్లో ఆరోగ్య శాఖ అధికారుల సర్వేలు
మహారాష్ట్రలో తొలి జికా వైరస్ కేసు నమోదయింది. పూణే జిల్లాలోని పురందర్ ఏరియాలో 50 ఏళ్ళ మహిళకు ఈ వైరస్ సోకినట్టు ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. దీంతో చుట్టు పక్కల గ్రామాల్లో విస్తృత సర్వేలు ప్రారంభించినట్టు వారు తెలిపారు.
మహారాష్ట్రలో తొలి జికా వైరస్ కేసు నమోదయింది. పూణే జిల్లాలోని పురందర్ ఏరియాలో 50 ఏళ్ళ మహిళకు ఈ వైరస్ సోకినట్టు ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. దీంతో చుట్టు పక్కల గ్రామాల్లో విస్తృత సర్వేలు ప్రారంభించినట్టు వారు తెలిపారు. ఈ మహిళ కోలుకుందని, కానీ ముందు జాగ్రత్త చర్యంగా ఆమెతో బాటు ఆమె కుటుంబ సభ్యుల నమూనాలను పూణే లోని వైరాలజీ ల్యాబ్ కు పంపామని వారు చెప్పారు. ముఖ్యంగా దీనికి తోడు చికెన్ గున్యా కేసులు కూడా చాలావరకు నమోదవుతున్నాయని, జులై మొదటివారం నుంచి ఈ జిల్లాలోని వందలాది కుటుంబాలకు చెందిన శాంపిల్స్ ను వైరాలజీ సంస్థకు పంపినట్టు వారు పేర్కొన్నారు. ఇప్పటివరకు ఈ వైరస్ కేసులపై పెద్దగా శ్రద్ధ పెట్టకపోయినప్పటికీ.. ఇక ఎప్పటికప్పుడు సర్వేలు చేయాలనీ ప్రభుత్వం ఆదేశించిందన్నారు. ఇప్పటికే కేరళలో 63 కేసులు నమోదయ్యాయని వారన్నారు. దేశంలో ఈ వైరస్ వెలుగులోకి వచ్చిన రాష్ట్రం మొదట కేరళ రాష్ట్రమే..
ఏడీస్ దోమల ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందని, ఇది చివరకు డెంగ్యూ తదితర వ్యాధులకు దారి తీస్తుందని అధికారులు పేర్కొన్నారు. కాగా మహారాష్ట్రలో పలు జిల్లాల్లో జులై రెండో వారం నుంచి పలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు 41 శాంపిల్స్ ను సేకరించి పూణే లోని సంస్థకు పంపారు. 1947 లో ఉగాండాలోని కోతుల ద్వారా ఈ వైరస్ మొదట వెలుగులోకి రాగా ఆ తరువాత 1952 లో ఇండియాలో మొదటి కేసు నమోదయింది. అయితే ఇది దోమల ద్వారా సంక్రమిస్తుందని ఆ తరువాత వెల్లడయింది.
మరిన్ని ఇక్కడ చూడండి: పార్లమెంటులో విపక్షాల రభసతో రూ.133 కోట్లకు పైగా నష్టం.. ప్రభుత్వ వర్గాలు.. ఇది ప్రజాధనమేనని వ్యాఖ్య
Viral Video: సముద్రం అడుగున్న 8ఏళ్ల చిన్నారి.. ఏం చేస్తుందంటే..?? వీడియో