లిక్క‌ర్ దొర‌క్క మందుబాబుల పిచ్చి ప్ర‌వ‌ర్త‌న..ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రికి భారీగా క్యూ…

లాక్‌డౌన్ వ‌ల్ల ఎవ‌రికి ఎలాంటి ఇబ్బంది ఉందో తెలీదు కానీ మందుబాబులు మాత్రం విప‌రీత చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు. ఏళ్ల తరబడి మ‌ద్య‌పానానికి బానిసగా ఉండి..ఒక్క‌సారే లిక్క‌ర్ చుక్క దొర‌క్క‌పోవ‌డంతో వారి పరిస్థితి వ‌ర్ణ‌ణాతీతంగా మారింది. కొంద‌రు మ‌ద్యం షాపుల తలుపులు బ‌ద్ద‌లు కొట్టేందుకు ప్ర‌య‌త్నిస్తూ ఉండ‌గా, మ‌రికొంద‌రు పిచ్చి పట్టినట్లు బిహేవ్ చేస్తున్నారు. ఇంకొన్ని చోట్ల ఆత్మ‌హ‌త్య‌లు కూడా సంభవిస్తున్నాయి. దీంతో కుటుంబ స‌భ్య‌లు వారిని ఎర్ర‌గడ్డ మానసిక వైద్యశాలకు తీసుకువ‌స్తున్నారు. ఓపీకి ఇప్ప‌టికే 100కు పైగా […]

లిక్క‌ర్ దొర‌క్క మందుబాబుల పిచ్చి ప్ర‌వ‌ర్త‌న..ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రికి భారీగా క్యూ...
Follow us

|

Updated on: Mar 30, 2020 | 4:01 PM

లాక్‌డౌన్ వ‌ల్ల ఎవ‌రికి ఎలాంటి ఇబ్బంది ఉందో తెలీదు కానీ మందుబాబులు మాత్రం విప‌రీత చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు. ఏళ్ల తరబడి మ‌ద్య‌పానానికి బానిసగా ఉండి..ఒక్క‌సారే లిక్క‌ర్ చుక్క దొర‌క్క‌పోవ‌డంతో వారి పరిస్థితి వ‌ర్ణ‌ణాతీతంగా మారింది. కొంద‌రు మ‌ద్యం షాపుల తలుపులు బ‌ద్ద‌లు కొట్టేందుకు ప్ర‌య‌త్నిస్తూ ఉండ‌గా, మ‌రికొంద‌రు పిచ్చి పట్టినట్లు బిహేవ్ చేస్తున్నారు. ఇంకొన్ని చోట్ల ఆత్మ‌హ‌త్య‌లు కూడా సంభవిస్తున్నాయి. దీంతో కుటుంబ స‌భ్య‌లు వారిని ఎర్ర‌గడ్డ మానసిక వైద్యశాలకు తీసుకువ‌స్తున్నారు. ఓపీకి ఇప్ప‌టికే 100కు పైగా బాధితులు వ‌చ్చారని ఆస్ప‌త్రి సిబ్బంది వెల్ల‌డించారు.

హైదరాబాద్‌లో మద్యానికి బానిసైన ఓ యువకుడు ఎంత ప్ర‌య‌త్నించినా లిక్క‌ర్ దొర‌క్క‌పోవ‌డంతో నడి రోడ్డుపై బ్లేడుతో గొంతు కోసుకున్నాడు. వికారాబాద్‌ జిల్లా తోరుమామిడికి చెందిన మొగులయ్య అనే వ్య‌క్తి శనివారం శ్రీనగర్‌ కాలనీలో ట్రాన్స్‌ఫార్మర్‌ను పట్టుకుని… క‌రెంట్ షాక్ తో అక్కడికక్కడే మరణించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ సిటీలో నివ‌శించే సయ్యద్‌ ఎజాజ్‌ అనే వ్యక్తి కల్లు దొరక్క పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. వెల్లుర్తి మండలం కాశమైన కిష్టయ్య తన ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. మెదక్‌ జిల్లా చేగుంటలో నివ‌శించే నత్తి మంగమ్మ కల్లు లభించక పిచ్చిగా ప్ర‌వ‌రిస్తూ కింద‌ప‌డి గాయాల‌తో మ‌ర‌ణించింది. ఇక గ‌త రెండు రోజుల్లో మల్కాజిగిరి జిల్లా హస్పిటల్‌కు సుమారు 15 మంది మందుబాబులు చికిత్స కోసం వ‌చ్చారు. తెలంగాణ‌లోని కొన్ని ప్రాంతాల్లో క‌ల్లు దొర‌క్క గిరిజ‌నులు, డైలీ లేబ‌ర్ మాన‌సిక ప‌ర‌మైన స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్న‌ట్లు తెలుస్తోంది.