టాలీవుడ్‌లో విషాదం.. సీనియర్ దర్శకుడికి రోడ్డు యాక్సిడెంట్!

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీని విషాదాలు అలుముకున్నాయి. వరుసగా సినీ ప్రముఖులు రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఆ మధ్య ఓ సీనియర్ నిర్మాత మరణం.. హీరో రాజశేఖర్ రోడ్డు యాక్సిడెంట్ ఇలా ఎన్నో విషాద సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇలాంటి తరుణంలో మరో చేదు వార్త వినిపించింది. తాజాగా ఓ టాలీవుడ్ దర్శకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. రెండేళ్ల క్రితం ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బీ’ అనే సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన మల్లికార్జున రావు […]

టాలీవుడ్‌లో విషాదం.. సీనియర్ దర్శకుడికి రోడ్డు యాక్సిడెంట్!
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 22, 2020 | 12:35 PM

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీని విషాదాలు అలుముకున్నాయి. వరుసగా సినీ ప్రముఖులు రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఆ మధ్య ఓ సీనియర్ నిర్మాత మరణం.. హీరో రాజశేఖర్ రోడ్డు యాక్సిడెంట్ ఇలా ఎన్నో విషాద సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇలాంటి తరుణంలో మరో చేదు వార్త వినిపించింది. తాజాగా ఓ టాలీవుడ్ దర్శకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు.

రెండేళ్ల క్రితం ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బీ’ అనే సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన మల్లికార్జున రావు రోడ్డు యాక్సిడెంట్‌కు గురయ్యారు. ఈ ఘటనలో ఆయన తీవ్ర గాయాలపాలయ్యారు. కుటుంబసభ్యులు ఆయన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. ప్రాణాపాయం లేకపోయినా తీవ్ర గాయాలు కావడంతో కొన్ని రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. కాగా, సినీ ఇండస్ట్రీ పెద్దలు, కొందరు దర్శకులు ఆయన్ని కలిసి పరామర్శించారు.