మూడు రాజధానుల సెగ.. నేడు గుంటూరు బంద్!
రాజధాని మార్పును వ్యతిరేకిస్తూ అమరావతి పరిరక్షణ సమితి నేడు గుంటూరు జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. ఆర్టీసీ బస్సులు మినహాయించి కాలేజీలు, పాఠశాలలు, వ్యాపార సంస్థలు, సినిమా హాళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు స్వచ్ఛంధంగా మూసివేయాలని జేఏసీ విజ్ఞప్తి చేసింది. అంతేకాకుండా ప్రజలు పెద్ద ఎత్తున బంద్‌లో పాల్గొని మద్దతు తెలపాలని కోరింది. అయితే పోలీసులు మాత్రం బంద్‌కు ఎలాంటి అనుమతులు లేవని తేల్చి చెప్పారు. బంద్‌తో ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉందని దుకాణాలను, పాఠశాలలను బలవంతంగా మూయించవద్దని […]
రాజధాని మార్పును వ్యతిరేకిస్తూ అమరావతి పరిరక్షణ సమితి నేడు గుంటూరు జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. ఆర్టీసీ బస్సులు మినహాయించి కాలేజీలు, పాఠశాలలు, వ్యాపార సంస్థలు, సినిమా హాళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు స్వచ్ఛంధంగా మూసివేయాలని జేఏసీ విజ్ఞప్తి చేసింది. అంతేకాకుండా ప్రజలు పెద్ద ఎత్తున బంద్‌లో పాల్గొని మద్దతు తెలపాలని కోరింది.
అయితే పోలీసులు మాత్రం బంద్‌కు ఎలాంటి అనుమతులు లేవని తేల్చి చెప్పారు. బంద్‌తో ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉందని దుకాణాలను, పాఠశాలలను బలవంతంగా మూయించవద్దని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా.. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే మాత్రం చట్టపరమైన చర్యలు చేపడతామని పోలీసులు స్పష్టం చేశారు.
కాగా, ఇప్పటికే అమరావతి పరిధిలోని గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే అమరావతి జేఏసీ బంద్‌కు పిలుపునివ్వడంతో అసెంబ్లీ, సచివాలయంతో పాటుగా పలు చోట్ల పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.