ప్రారంభమైన తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 120 మున్సిపాల్టీలు, 9 కార్పోరేషన్లలో ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎక్కడా ఎలాంటి సమస్య లేకుండా బ్యాలెట్ పద్దతిలో ఓటింగ్ జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నాగిరెడ్డి తెలిపారు. కాబట్టి ఓటర్లు ఎలాంటి గందరగోళానికి గురికావొద్దన్నారు. కాగా.. ఉదయాన్నే ఓటు వేసేందుకు పోలింగ్ బూత్‌లకు చేరుకున్నారు ఓటర్లు. కాగా.. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. […]
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 120 మున్సిపాల్టీలు, 9 కార్పోరేషన్లలో ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎక్కడా ఎలాంటి సమస్య లేకుండా బ్యాలెట్ పద్దతిలో ఓటింగ్ జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నాగిరెడ్డి తెలిపారు. కాబట్టి ఓటర్లు ఎలాంటి గందరగోళానికి గురికావొద్దన్నారు. కాగా.. ఉదయాన్నే ఓటు వేసేందుకు పోలింగ్ బూత్‌లకు చేరుకున్నారు ఓటర్లు.
కాగా.. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. కరీంనగర్ కార్పొరేషన్‌కు ఈనెల 24న ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో మొత్తం 2727 మున్సిపల్ వార్డులు, 385 కార్పొరేషన్ వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అయితే 7 వార్డుల్లో టీఆర్‌ఎస్, 3 వార్డుల్లో ఎం.ఐ.ఎం. అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 18 మున్సిపాల్టీలకు పోలింగ్ జరగనుంది. బరిలో 1704 మంది అభ్యర్థులు ఉండగా… వెయ్యి పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 9 మున్సిపాలిటీలకు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. 814 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 15 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా.. 1265 మంది బరిలో ఉన్నారు.
మొత్తంమీద రాష్ట్రవ్యాప్తంగా 7961 పోలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో 11,179 మంది కౌన్సిలర్ అభ్యర్థులు, 1747 మంది కార్పొరేటర్ అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 1240 మంది ఎన్నికల పరిశీలకులను నియమించారు. 120 మున్సిపాలిటీల్లో 20 లక్షల 14 వేల 601 పురుష ఓటర్లు, 20 లక్షల 25 వేల 762 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇక 9 కార్పొరేషన్లలో 6 లక్షల 66 వేల 900 మంది పురుష ఓటర్లు, 6 లక్షల 48 వేల 232 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.