Tollywood : రాజకీయాల్లోకి దిగిన హీరోయిన్.. ఆ పార్టీలో చేరిన మరో సినీ తార
సినీ తారలు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం అనేది చాలా కామన్. చాలా మంది సినీ సెలబ్రెటీలు చాలా మంది రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. తాజాగా ఓ సీనియర్ హీరోయిన్ కూడా ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ గా ఎదిగి ఆతర్వాత కనుమరుగైన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. కొందరు పెళ్లి చేసుకొని సెటిల్ అయితే మరికొంతమంది మాత్రం వివిధ కారణాలతో సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కాగా మరికొంతమంది రాజకీయాల్లో రాణిస్తున్నారు. సినీ సెలబ్రెటీలు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదు. ఇప్పటికే ఎన్టీఆర్, కృష్ణ, చిరంజీవి లాంటి సీనియర్ హీరోలు రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఇక పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, రోజా, నగ్మా, ఖుష్బూ ఇప్పటికీ రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఇటీవలే కనగానారనౌత్ కూడా రాజకీయ పార్టీలో చేరడమే కాదు ఏపీగా విజయం సాధించారు కూడా.. పవన్ కళ్యాణ్ ఏపీకి డిప్యూటీ సీఎం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. కాగా వీరిలానే ఇప్పుడు మరో సినీ నటి కూడా రాజకీయాల్లోకి అడుగుపెడుతుందని తెలుస్తుంది. ఆమే సీనియర్ హీరోయిన్ ఆమని.
అవునుఆమని త్వరలోనే రాజకీయ పార్టీలో చేరనున్నారని తెలుస్తుంది. నటి ఆమనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు ఆమె. ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన ఆమనీ ఇప్పుడు సీరియల్స్ లో నటిస్తున్నారు. అలాగే పలు సినిమాల్లో సహాయక పాత్రల్లోనూ కనిపించి మెప్పిస్తున్నారు. ఇన్నాళ్లు నటిగా మెప్పించిన ఆమె తాజాగా ఓ రాజకీయ పార్టీలో చేరారు.
ఆమనీ భారతీయ జనతా పార్టీలో చేరారు. బిజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆధ్వర్యంలో ఆమని కాషాయ కండువా కప్పుకున్నారు. ఆమనితో పాటు మేకప్ ఆర్టిస్ట్ శోభలత కూడా బీజేపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అక్కడ ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆమనీ ఇప్పుడు రాజకీయాల్లోకి రావడం ఆసక్తికరంగా మారింది. కాగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆమని.. పలు సామాజిక అంశాల పై స్పందిస్తూ ఉంటారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








