రక్షకుడు.. ఆ వెంటనే రాక్షసుడు.. వార్‌కు సిద్ధం!

నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి ‘వి’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ కొద్దిరోజుల క్రితమే పూర్తయ్యింది. హీరో నాని మొదటిసారి విలన్‌గా కనిపించనున్నాడు. అదితిరావు హైదరి, నివేదా థామస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హీరోగా పరిచయం చేసిన డైరెక్టరే.. ఇప్పుడు విలన్‌గా చూపిస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలోని పాత్రల ఫస్ట్ లుక్స్ తేదీలను హీరోలే స్వయంగా తమ […]

  • Ravi Kiran
  • Publish Date - 8:15 am, Wed, 22 January 20
రక్షకుడు.. ఆ వెంటనే రాక్షసుడు.. వార్‌కు సిద్ధం!

నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి ‘వి’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ కొద్దిరోజుల క్రితమే పూర్తయ్యింది. హీరో నాని మొదటిసారి విలన్‌గా కనిపించనున్నాడు. అదితిరావు హైదరి, నివేదా థామస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హీరోగా పరిచయం చేసిన డైరెక్టరే.. ఇప్పుడు విలన్‌గా చూపిస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇదిలా ఉంటే ఈ సినిమాలోని పాత్రల ఫస్ట్ లుక్స్ తేదీలను హీరోలే స్వయంగా తమ ట్విట్టర్ ఖాతాల ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘కృష్డుడి గీతలో ఎపుడో చెప్పారు … “రాక్షసుడు” ఎదిగిన నాడు ఒకడొస్తాడని ….. వాడే ఇప్పుడొస్తున్నాడు … “రక్షకుడు” వస్తున్నాడు’ అంటూ రక్షకుడిగా నేను జనవరి 27న మీ ముందుకు వస్తున్నానని సుధీర్ బాబు ట్వీట్ చేయగా.. నాని దీనికి జవాబిస్తూ.. ‘ఓహో… అలాగా… సరే!’ రాక్షసుడు జనవరి 28న వచ్చేస్తున్నాడని పేర్కొన్నాడు. 

జ‌గ‌ప‌తిబాబు, శ్రీ‌నివాస్ అవ‌స‌రాల‌, వెన్నెల కిషోర్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. కాగా, మార్చి 25న ఉగాది కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.