AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇకపై డిగ్రీ కాలేజీల్లోనూ మేనేజ్‌మెంట్ కోటా!

డిగ్రీ విద్యలో మార్పులు చేస్తూ ఉన్నత విద్యామండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇంజినీరింగ్‌లో మాదిరిగానే ఇకపై డిగ్రీలో కూడా మేనేజ్‌మెంట్ కోటాను అమలు కానుంది. ఈ జూన్ నుంచి కొత్త విద్యా సంవత్సరం(2020-21) మొదలు కానున్న నేపథ్యంలో.. రాష్ట్రంలోని అన్ని డిగ్రీ కాలేజీల్లోనూ మేనేజ్‌మెంట్ కోటాను ప్రవేశపెట్టాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. గత ఏడాదే ఈ ప్రతిపాదనను కాలేజీ యాజమాన్యాలు మండలి ముందు ఉంచిన సంగతి తెలిసిందే. ఇక కొత్త విద్యా సంవత్సరం నుంచి మేనేజ్‌మెంట్ […]

ఇకపై డిగ్రీ కాలేజీల్లోనూ మేనేజ్‌మెంట్ కోటా!
Ravi Kiran
| Edited By: |

Updated on: Jan 22, 2020 | 3:52 PM

Share

డిగ్రీ విద్యలో మార్పులు చేస్తూ ఉన్నత విద్యామండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇంజినీరింగ్‌లో మాదిరిగానే ఇకపై డిగ్రీలో కూడా మేనేజ్‌మెంట్ కోటాను అమలు కానుంది. ఈ జూన్ నుంచి కొత్త విద్యా సంవత్సరం(2020-21) మొదలు కానున్న నేపథ్యంలో.. రాష్ట్రంలోని అన్ని డిగ్రీ కాలేజీల్లోనూ మేనేజ్‌మెంట్ కోటాను ప్రవేశపెట్టాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది.

గత ఏడాదే ఈ ప్రతిపాదనను కాలేజీ యాజమాన్యాలు మండలి ముందు ఉంచిన సంగతి తెలిసిందే. ఇక కొత్త విద్యా సంవత్సరం నుంచి మేనేజ్‌మెంట్ కోటా అమలు కానుండటంతో 30 శాతం సీట్లు యాజమాన్యాలే భర్తీ చేసుకునేలా అనుమతులు లభించనున్నాయి. అంతేకాకుండా ఈ కోటా ద్వారా చేరే విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించదు.

ఇకపోతే 100 శాతం విద్యార్థులు చేరిన కోర్సులకు అదనపు సెక్షన్లు, కొత్త కోర్సులకు కూడా అనుమతులు ఇవ్వాలని నిర్ణయించింది. అటు అటానమస్ డిగ్రీ కాలేజీల్లో భాషా సబ్జెక్టులను ఇకపై మూడేళ్లు కాకుండా రెండేళ్లు చదివేలా చర్యలు చేపడతామని మండలి హామీ ఇచ్చింది.

Follow Us