‘టీఆర్ఎస్‌’కే ఓటు వేయండంటున్న రేవంత్ రెడ్డి.. వీడియో వైరల్!

టీఆర్‌ఎస్‌కే ఓటు వేయాలంటూ.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కీలక నేత రేవంత్ పిలుపునిచ్చారు. అవును అది ఒక వీడియోలో. ఎప్పుడూ ఎనర్జిటిక్‌గా ఉంటూ.. పార్టీలో దూకుడుతనాన్ని ప్రదర్శిస్తూంటారు రేవంత్ రెడ్డి. అలాంటి ఆయన నోటి వెంట టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయండంటూ చెబుతున్న.. ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో ఆయన మాట్లాడుతూ ‘మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సమర్థవంతమైన నాయకత్వాన్ని చూసి.. అన్ని డివిజన్లలో.. అన్ని వార్డుల్లో.. […]

'టీఆర్ఎస్‌'కే ఓటు వేయండంటున్న రేవంత్ రెడ్డి.. వీడియో వైరల్!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jan 22, 2020 | 10:27 AM

టీఆర్‌ఎస్‌కే ఓటు వేయాలంటూ.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కీలక నేత రేవంత్ పిలుపునిచ్చారు. అవును అది ఒక వీడియోలో. ఎప్పుడూ ఎనర్జిటిక్‌గా ఉంటూ.. పార్టీలో దూకుడుతనాన్ని ప్రదర్శిస్తూంటారు రేవంత్ రెడ్డి. అలాంటి ఆయన నోటి వెంట టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయండంటూ చెబుతున్న.. ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో ఆయన మాట్లాడుతూ ‘మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సమర్థవంతమైన నాయకత్వాన్ని చూసి.. అన్ని డివిజన్లలో.. అన్ని వార్డుల్లో.. టీఆర్ఎస్‌ పార్టీని గెలిపించాలంటూ.. చెబుతున్నాం’ అని నోరు జారారు. అయితే ఈ మాటలు పొరపాటున వచ్చాయా? లేక.. ఎవరైనా వీడియో ఎడిట్ చేసి వైరల్ చేశారా? అనేది తెలియాల్సి ఉంది. సాధారణంగా ఇలాంటి పొరపాట్లు అప్పుడప్పుడు జరుగుతూంటాయి. పార్టీ మారిన కొందరు నేతలు.. అదే మాటలు అలవాటయి.. పలు బహిరంగ సభల్లో నోరు జారుతూంటారు. అయితే దీనిపై రేవంత్ రెడ్డి మాత్రం ఇంకా స్పందించలేదు. ఏదేమైనా.. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది.