రాంచరణ్‌ సినిమాని కొట్టేసిన నాని.. ఏం జరిగిందంటే?

రాంచరణ్ సినిమాని కొట్టేసిన నేచురల్ స్టార్ నాని. అందేంటి? అదెలా అని షాక్ అవ్వకండి. ఒక హీరో చేయాల్సిన సినిమా.. మరో హీరో చేతుల్లోకి అప్పుడప్పుడు వెళ్తూంటాయి. అది వారి సినిమా డేట్స్ అడ్జెస్ట్ కాక ఉండొచ్చు. అలాగే మరే ఇతర కారణాలు కూడా అయి ఉండొచ్చు. ఆ రకంగానే.. రాంచరణ్ చేయాల్సిన ఓ సినిమా నాని చేతుల్లోకి వెళ్లింది. అది ఏ సినిమా అని ఆలోచిస్తున్నారా? అదే ‘ఎటో వెళ్లిపోయింది మనసు’. గౌతమ్ వాసుదేవ్ మీనన్ […]

రాంచరణ్‌ సినిమాని కొట్టేసిన నాని.. ఏం జరిగిందంటే?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jan 22, 2020 | 10:31 AM

రాంచరణ్ సినిమాని కొట్టేసిన నేచురల్ స్టార్ నాని. అందేంటి? అదెలా అని షాక్ అవ్వకండి. ఒక హీరో చేయాల్సిన సినిమా.. మరో హీరో చేతుల్లోకి అప్పుడప్పుడు వెళ్తూంటాయి. అది వారి సినిమా డేట్స్ అడ్జెస్ట్ కాక ఉండొచ్చు. అలాగే మరే ఇతర కారణాలు కూడా అయి ఉండొచ్చు. ఆ రకంగానే.. రాంచరణ్ చేయాల్సిన ఓ సినిమా నాని చేతుల్లోకి వెళ్లింది. అది ఏ సినిమా అని ఆలోచిస్తున్నారా? అదే ‘ఎటో వెళ్లిపోయింది మనసు’.

గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో.. ముందుగా చెర్రీనే హీరో అనుకున్నారట. అయితే చరణ్ వేరే ప్రాజెక్టులో బిజీగా ఉండటం, డేట్స్ సర్దుబాటు కాకపోవడం, ఇతరత్రా కారణాలతో ఈ చిత్రాన్ని సున్నితంగా తిరస్కరించాడట. దీంతో ఈ ప్రేమకథలోకి నాని ఎంటరయ్యాడు. కథ బాగా నచ్చడంతో.. నాని వెంటనే ఓకే చెప్పేశాడట. ఈ సినిమాలో హీరోయిన్‌గా సమంతా నటించింది. ప్రేమలో గెలుపోటములు సహజం.. కానీ.. కాస్త ఓర్చుకుంటే విజయం నీ సొంతమవుతుందని ఈ సినిమా కథ తెలియజేస్తుంది. అలాగే.. ఈ సినిమాలోని ‘ప్రియతమా నీవచట కుశలమా.. నేనిచట కుశలమే’ అనే సాంగ్ బాగా పాపులర్ అయ్యింది.