Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గాలిపటం కోసం పరుగెత్తిన బాలుడు అనంతలోకాలకు.. ఏం జరిగిందంటే..

కాగా గాలిపటాలు కొనుక్కోవడానికి టేక్మాల్ నుంచి సుమారు 20 కిలోమీటర్లు దూరం ఉన్న జోగిపేటకు వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. శ్రీరామ్ తన ముగ్గురు మిత్రులతో కలిసి జోగిపేట పట్టణానికి వెళ్ళాడు. శ్రీరామ్ మృతితో భయాందోళనకు గురైన తోటి మిత్రులు టేక్మాల్ కు చేరుకొని గ్రామస్థులకు విషయం చెప్పారు..జోగిపేట పోలీసులు

గాలిపటం కోసం పరుగెత్తిన బాలుడు అనంతలోకాలకు.. ఏం జరిగిందంటే..
Boy Who Went For The Kite D
Follow us
P Shivteja

| Edited By: Jyothi Gadda

Updated on: Jan 13, 2025 | 8:50 AM

గాలిపటం సరదా ఓ బాలుడి నిండు ప్రాణాన్ని బలిగొంది. తెగిన గాలిపటం కోసం పరిగేడుతూ ట్రాక్టర్ డీకొని ప్రాణాలు విడిచాడు ఓ బాలుడు..వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం జోగిపేట బస్ స్టాప్ సమీపంలో నాందేడ్ – అకోలా ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది.. తెగిన గాలిపటాన్ని అందుకునే క్రమంలో ఓ బాలుడు ప్రమాదమశాత్తు ఎదురుగా ఆగివున్న ట్రాక్టర్ ను గుర్తించకుండా బలంగా ఢీకొని మృతిచెందాడు…

మెదక్ జిల్లా టేక్మాల్ మండల కేంద్రానికి చెందిన నీరుడి శ్రీరామ్ అనే బాలుడు (8) తెగిపోయిన గాలిపటం కోసం పైకి చూస్తూ ఎదురుగా ఉన్న ట్రాక్టర్ ను గుర్తించకుండా ఢీకొనడంతో బాలుడు అక్కడే కుప్పకూలి పోయాడు…స్థానికులు బాలుడిని హుటాహుటిన జోగిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడు..మృతి చెందిన బాలుడు టేక్మాల్ గ్రామానికి చెందిన శ్రీరాముగా గుర్తించారు..మృతుడు శ్రీరామ్ తండ్రి గతంలో ప్రమాదవశాత్తు కుసంగి చెరువులో పడి మృతిచెందాడు. ఇప్పుడు బాలుడు కూడా మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

కాగా గాలిపటాలు కొనుక్కోవడానికి టేక్మాల్ నుంచి సుమారు 20 కిలోమీటర్లు దూరం ఉన్న జోగిపేటకు వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. శ్రీరామ్ తన ముగ్గురు మిత్రులతో కలిసి జోగిపేట పట్టణానికి వెళ్ళాడు. శ్రీరామ్ మృతితో భయాందోళనకు గురైన తోటి మిత్రులు టేక్మాల్ కు చేరుకొని గ్రామస్థులకు విషయం చెప్పారు..జోగిపేట పోలీసులు టేక్మాల్ పోలీసులు, తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఈ ఘటనతో బాలుడి కుటుంబంతో పాటుగా గ్రామంలోనూ విషాదం నెలకొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..