సూరారం కట్టమైసమ్మ చెరువులో మహిళ మృతదేహం, హత్యకోణంలో దర్యాప్తు ప్రారంభించిన దుండిగల్ పోలీసులు

హైదరాబాద్ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూరారం కట్టమైసమ్మ చెరువులో గుర్తుతెలియని మహిళ మృతదేహం బయటపడింది. స్థానికులు 100..

  • Venkata Narayana
  • Publish Date - 3:02 pm, Wed, 27 January 21
సూరారం కట్టమైసమ్మ చెరువులో మహిళ మృతదేహం, హత్యకోణంలో దర్యాప్తు ప్రారంభించిన దుండిగల్ పోలీసులు

హైదరాబాద్ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూరారం కట్టమైసమ్మ చెరువులో గుర్తుతెలియని మహిళ మృతదేహం బయటపడింది. స్థానికులు 100 కి డయిల్ చేసి సమాచారం ఇవ్వడంతో దుండిగల్ పోలీసులు సూరారం చెరువు వద్దకు ‌వెళ్ళి ఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. మహిళ మృతదేహాన్ని శవ పరీక్ష కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహిళ ఎవరన్నదానిపైనా, ఎలా మృతి చెందిందనన్న అంశంపైనా దర్యాప్తు ప్రారంభించారు. డెడ్ బాడీ మీద గాయాలు ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు ఎవరైనా హత్య చేసి ఉంటారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.