AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TollyWood: సినీ ప్రేక్షకులకు పండగలాంటి వార్త… ఒకేరోజు విడుదల కానున్న మూడు సినిమాలు..

Three Movies Releasing On FEB 12: కరోనా కారణంగా ఏర్పడ్డ లాక్‌డౌన్‌తో తీవ్ర ప్రభావం ఎదుర్కొన్న రంగాల్లో సినీ పరిశ్రమ ఒకటి. ఎప్పుడూ సినిమాలతో కోలాహలంగా ఉండే థియేటర్లు మూతపడడంతో సినీ లవర్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు...

TollyWood: సినీ ప్రేక్షకులకు పండగలాంటి వార్త... ఒకేరోజు విడుదల కానున్న మూడు సినిమాలు..
Narender Vaitla
|

Updated on: Jan 27, 2021 | 3:52 PM

Share

Three Movies Releasing On FEB 12: కరోనా కారణంగా ఏర్పడ్డ లాక్‌డౌన్‌తో తీవ్ర ప్రభావం ఎదుర్కొన్న రంగాల్లో సినీ పరిశ్రమ ఒకటి. ఎప్పుడూ సినిమాలతో కోలాహలంగా ఉండే థియేటర్లు మూతపడడంతో సినీ లవర్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. వారాంతం వచ్చిందంటే సినిమానే ఆటవిడుపుగా భావించే సదరు సినీ ప్రేక్షకులకు థియేటర్లు మూతపడడంతో ఇంట్లోనే కాలక్షేపం చేసే పరిస్థితులు వచ్చాయి. అయితే పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడే మార్పులు వస్తున్నాయి. మళ్లీ థియేటర్ల సందడి మొదలైంది. థియేటర్లు తిరిగి ప్రారంభించడానికి ప్రభుత్వాలు అనుమతులివ్వడంతో మళ్లీ సందడి మొదలైంది. ఈ క్రమంలోనే సంక్రాంతికి వచ్చిన థియేటర్లకు మంచి స్పందన వచ్చింది. ప్రేక్షకులు కూడా కరోనా నిబంధనలు పాటిస్తూ థియేటర్లకు క్యూ కట్టడంతో నిర్మాతల్లోనూ మళ్లీ ఆశలు చిగురించాయి. ఇందులో భాగంగానే వరుస సినిమాలు థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక ఫిబ్రవరి 12న ఒక్కరోజే ఏకంగా మూడు సినిమాలు విడుదల కానున్నాయి. వీటిలో మొదటిది.. ‘ఉప్పెన’. మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కుతోన్న తొలి సినిమా కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంబంధించిన పాటలు, ట్రైలర్ సినిమాపై అమాంతం అంచనాలు పెంచేశాయి. జగపతి బాబు ప్రధాన పాత్రలో రామ్ కార్తీక్, అమ్ము అభిరామి జంటగా తెరకెక్కుతోన్న ‘ఎఫ్‌సీయూకే’ (ఫాద‌ర్-చిట్టి-ఉమా-కార్తీక్‌) చిత్రాన్ని కూడా ఫిబ్రవరి 12న విడుదల చేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది.

ఇక ఫిబ్రవరి 12న ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి వస్తోన్న మరో చిత్రం ఆది హీరోగా తెరకెక్కిన ‘శశి’. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని ‘ఒకే ఒక లోకమ్’ పాట యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఆది కచ్చితంగా విజయాన్ని అందుకోవాల్సిన సమయంలో వస్తోన్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇలా ఒకేరోజు 3 సినిమాలు విడుదల కానుండడంతో టాలీవుడ్ ఫిబ్రవరి 12న పండగ వాతావరణం నెలకొంది.

ఇక ఫిబ్రవరి నెలలో రానున్న మరో చిత్రాల్లో.. విశాల్ హీరోగా తెరకెక్కుతోన్న ‘చక్ర’ సినిమా ఒకటి. హ్యాకింగ్ నేపథ్యంలో సాంకేతిక కథాంశంతో తెరకెక్కిన ‘అభిమన్యుడు’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాను ఫిబ్రవరి 5న విడుదల చేయనున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ వ్యాలన్‌టైన్స్ డే కానుకగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోందని సమాచారం.

Also Read: స్టార్ హీరోలను లైన్లో పెడుతున్న కేజీఎఫ్ డైరెక్టర్.. ఈసారి మరో టాప్ హీరోతో భారీ ప్లాన్ చేస్తున్న ప్రశాంత్ ? Rangi Movie update: మణిరత్నం సినిమా కోసం ఆ మూవీని చకచక కంప్లీట్ చేసిన స్టార్ హీరోయిన్..