ఎర్రకోటపై జాతీయ జెండా మాత్రమే ఎగరాలి.. కానీ ఓ సంస్థ కుట్ర చేసింది..! అది ఎవరు..? ఎక్కడి నుంచో తెలుసా..?

ఎర్రకోటపై జాతీయ జెండా మాత్రమే ఎగరాలి.. కానీ.. నిన్న మాత్రం జాతీయ జెండా సాక్షిగానే.. మరికొన్ని జెండాలనూ ఎగరవేశారు ఆందోళనకారులు.. దీని వెనుక భారీ కుట్ర ఉందా..? ఢిల్లీ శివార్లలో జరగాల్సిన..

ఎర్రకోటపై జాతీయ జెండా మాత్రమే ఎగరాలి.. కానీ ఓ సంస్థ కుట్ర చేసింది..! అది ఎవరు..? ఎక్కడి నుంచో తెలుసా..?
Follow us

|

Updated on: Jan 27, 2021 | 4:38 PM

Khalistan Flags : ఎర్రకోటపై జాతీయ జెండా మాత్రమే ఎగరాలి.. కానీ.. నిన్న మాత్రం జాతీయ జెండా సాక్షిగానే.. మరికొన్ని జెండాలనూ ఎగరవేశారు ఆందోళనకారులు.. దీని వెనుక భారీ కుట్ర ఉందా..? ఢిల్లీ శివార్లలో జరగాల్సిన రైతుల ట్రాక్టర్ ర్యాలీ.. రెడ్‌ ఫోర్ట్‌ దాకా రావడం వెనుక ఉగ్ర వ్యూహం ఉందా..? దీనిపైనే డౌట్‌ ఉందంటున్నాయి ఇంటెలిజెన్స్‌.. రిపబ్లిక్ డే రోజున ఎర్రకోటపై ఖలిస్తానీ జెండా ఎగరవేయాలన్న సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ ఆఫర్‌లో భాగంగానే.. ఆందోళనకారులు అక్కడ జెండా ఎగరవేసినట్లు తెలుస్తోంది.

ఇండియా గేట్‌ దగ్గర ఖలిస్తానీ జెండా ఎగరవేస్తే.. వారికి భారత కరెన్సీ ప్రకారం 2కోట్లు బహుమతిగా ఇస్తామన్నది సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ అనౌన్స్‌మెంట్‌. దీనకిి ఆశపడే.. కొంతమంది ఆందోళనకారులు ఆ దిశగా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయితే.. ఇండియాగేట్‌కు వెళ్లే వీలు లేకపోవడంతో.. ఎర్రకోటను ముట్టడించి అక్కడ జెండాలు ఎగురవేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైతు ఉద్యమంలో ఆ సంస్థ జోక్యం చేసుకున్నట్లూ నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఆందోళనలకు ఆ సంస్థే ఫండ్స్‌ సమకూరుస్తుందా అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఇందుకు తగ్గట్లుగా గణతంత్ర దినోత్సవం రోజు ఇండియా గేట్ వద్ద ఖలిస్తాన్ జెండా ఎగురవేయాలని సిఖ్స్ ఫర్ జస్టిస్ ప్రకటన విడుదల చేసింది. జెండా ఎగరేసిన వారికి 2.5 లక్షల అమెరికన్ డాలర్లు (భారత కరెన్సీలో 2 కోట్లకు పైనే) బహుమతిగా ఇస్తామని తెలిపింది. పంజాబ్ ప్రాంతాన్ని వేరే దేశంగా ఖలిస్తాన్ పేరుతో ఏర్పాటు చేయడమే తమ సంస్థ లక్ష్యం అంటూ పేర్కొంది. రైతు ఉద్యమం పేరుతో జరుగుతున్న ఆందోళనలకు నిధులు సమకూర్చుతున్న సంస్థ కూడా ఇదే ని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి :

Ardhashathabdam Teaser: ‘యుద్ధమే ధర్మం కానప్పుడు.. ధర్మ యుద్ధాలు ఎక్కడివి’… ఆసక్తికరంగా ‘అర్థ శతాబ్ధం’ టీజర్.. సూరారం కట్టమైసమ్మ చెరువులో మహిళ మృతదేహం, హత్యకోణంలో దర్యాప్తు ప్రారంభించిన దుండిగల్ పోలీసులు