Development Of Telangana: తెలంగాణ అభివృద్ధిలో ఉద్యోగులది కీలక పాత్ర… ఆర్థిక మంత్రి హరీశ్‌రావు…
తెలంగాణ అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకం అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. హైదరాబాద్ కొండాపూర్‌లోని తన నివాసంలో టీఎన్‌జీఓ...
తెలంగాణ అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకం అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. హైదరాబాద్ కొండాపూర్‌లోని తన నివాసంలో టీఎన్‌జీఓ యూనియన్ సిద్దిపేట జిల్లా డైరీతో పాటు హాస్టల్ వేల్ఫేర్ ఆఫీసర్స్ అసోసియేషన్, సిద్దిపేట అర్బన్ క్యాలెండర్‌లను టీఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, కార్యదర్శి ప్రతాప్‌లతో కలిసి మంత్రి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగులు ఎంతో కష్టపడి అన్ని రంగాల్లో ముందుంచుతున్నారని ప్రశంసించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారికి అందడంలో మంచి పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. త్వరలోనే ఉద్యోగుల సమస్యలు తొలగిపోయి, డిపార్ట్‌మెంట్ల వారీగా ప్రమోషన్లు ఇస్తామన్నారు. కార్యక్రమంలో సిద్దిపేట టీఎన్‌జీఓ అధ్యక్షుడు పరమేశ్వర్, కార్యదర్శి విక్రమ్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నర్సింలు, కోశాధికారి అశ్పాక్ అహ్మద్, రాజశేఖర్ వర్మ, మల్లేషం, రఘురామకృష్ణ, వెంకట రమణారెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.