ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌కి నాన్ బెయిలబుల్ వారెంట్.. రైల్వేస్టేషన్‌పై దాడి కేసులో ఎన్‌బీడబ్ల్యూ జారీ
వరంగల్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్‌ను ప్రత్యేక కోర్టు జారీ చేసింది. తెలంగాణ ఉద్యమ సమయంలో వినయ్ భాస్కర్‌పై నమోదైన కేసులో ప్రజాప్రతినిధుల..
Non Bailable Warrant : వరంగల్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్‌ను ప్రత్యేక కోర్టు జారీ చేసింది. తెలంగాణ ఉద్యమ సమయంలో వినయ్ భాస్కర్‌పై నమోదైన కేసులో ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు వారెంట్ జారీ చేసింది. 2012 కాజీపేట రైల్వేస్టేషన్‌లో దాడి చేసిన కేసులో వినయ్ భాస్కర్‌తో పాటు మరో 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
గతంలో ఈ కేసులో తొమ్మిది మందిపై నాన్ బెయిలబుల్ వారెంట్లను ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు జారీ చేసింది. గతంలో వినయ్ భాస్కర్, తక్కళ్లపల్లి రవీందర్ రావుపై(NBW) ఎన్‌బీడబ్ల్యూ జారీ చేసింది. ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో వరంగల్ జిల్లా నేతలపై కేసు విచారణ జరుగుతోంది.
అయితే..తక్కళ్లపల్లి రవీందర్ రావు సహా ఏడుగురికి ఫిబ్రవరి 10 వరకు ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు రిమాండ్ విధించింది. వినయ్ భాస్కర్, మరో ఇద్దరి ఆచూకీ తెలియడం లేదని పోలీసులు తెలిపారు. దీంతో పోలీసుల వివరణను కోర్టు నమోదు చేసింది.
అలాగే అమరేందర్ రెడ్డి, శ్రీరాములు, నరోత్తం రెడ్డిలపై ఎన్‌బీడబ్ల్యూ(NBW) అమలు చేయకపోవడంపై కాజీపేట పోలీసులపై ప్రజాప్రతినిధుల కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిబ్రవరి 3లోగా ఎన్ బీడబ్ల్యూ(NBW) అమలు చేయకపోతే కాజీపేట ఎస్ హెచ్ఓపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని ప్రజాప్రతినిధుల కోర్టు హెచ్చరించింది.