Anushka Launched Dial 100 Vehicles: ఫ్రీ షీ షటిల్ బస్‌లను ప్రారంభించిన అనుష్క.. ప్రతి మహిళా పోలీస్ ఒక స్టార్ అని ప్రశంస
హైదరాబాద్ లోని ఫ్రీ షీ షటిల్ బస్ ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హీరోయిన్ అనుష్క శెట్టి హాజరయ్యారు. షీ పాహి , ఫస్ట్ అన్యువల్ కాన్ఫరెన్స్ 2021 ప్రారంభోత్సవ కార్యక్రమంలో..
Anushka Launched Dial 100 Vehicles: హైదరాబాద్ లోని ఫ్రీ షీ షటిల్ బస్ ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హీరోయిన్ అనుష్క శెట్టి హాజరయ్యారు. షీ పాహి , ఫస్ట్ అన్యువల్ కాన్ఫరెన్స్ 2021 ప్రారంభోత్సవ కార్యక్రమంలో అనుష్కతో పాటుగా, అడిషనల్ డీజీ స్వాతి లక్రా, సైబరాబాద్ సీపీ సజ్జానార్ లు పాల్గొన్నారు. సైబరాబాద్ డయల్ 100 క్విక్ రెస్పాన్స్ వాహనాలను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో అనుష్క మాట్లాడుతూ.. ‘ఇక్కడ ఉన్న ప్రతి మహిళ పోలీస్ సిబ్బంది ఒక స్టార్’ అన్నారు. కోవిడ్ టైం లో పోలీస్ లు చాలా బాగా పని చేశారు. నన్ను ఇలాంటి కార్యక్రమ కు పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంత మంది మహిళా పోలీస్ లు ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ‘షీ పాహి’ అనే పేరు పెట్టడం చాలా బాగుంది. సమాజం లో ఒకరికి ఒకరు తోడుగా ఉండాలని’అనుష్క తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళ పోలీస్ అధికారులు పాల్గొన్నారు. అనంతరం వివిధ పోలీస్ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన పోలీస్ అధికారులకు ప్రశంస అవార్డులతో సత్కరించారు.
Also Read: 15 ఏళ్లు పైబడిన ప్రభుత్వ వాహనాలకూ స్క్రాపేజీ పాలసీ వర్తింపు.. 2022 ఏప్రిల్ 1 నుంచి అమలు