మాస్కోపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి.. భారతీయుడు మృతి, ముగ్గురికి గాయాలు
రష్యా రాజధాని మాస్కోలో ఆదివారం (మే 17) అర్ధరాత్రి ఉక్రెయిన్ జరిపిన భారీ డ్రోన్ దాడి తీవ్ర కలకలం రేపింది. ఈ ఘోర దాడిలో ఒక భారతీయ ఉద్యోగి ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు భారతీయులు తీవ్రంగా గాయపడ్డారు. రష్యాలోని భారత రాయబార కార్యాలయం ఈ విషాదకర సమాచారాన్ని అధికారికంగా ధృవీకరించింది.

రష్యా రాజధాని మాస్కోలో ఆదివారం (మే 17) అర్ధరాత్రి ఉక్రెయిన్ జరిపిన భారీ డ్రోన్ దాడి తీవ్ర కలకలం రేపింది. ఈ ఘోర దాడిలో ఒక భారతీయ ఉద్యోగి ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు భారతీయులు తీవ్రంగా గాయపడ్డారు. రష్యాలోని భారత రాయబార కార్యాలయం ఈ విషాదకర సమాచారాన్ని అధికారికంగా ధృవీకరించింది.
ఈ ఘటనపై భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియా ‘X’ లో స్పందిస్తూ, మరణించిన భారతీయ ఉద్యోగి కుటుంబానికి ప్రగాఢ సంతాపం ప్రకటించింది. రాయబార కార్యాలయ అధికారులు వెంటనే సంఘటనా స్థలాన్ని సందర్శించారని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారని పేర్కొంది. బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు స్థానిక అధికారులు, సదరు కంపెనీ యాజమాన్యంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించింది.
ఈ డ్రోన్ దాడుల ధాటికి మాస్కో ప్రాంతంలో మొత్తం ముగ్గురు మరణించగా, మరో 12 మంది గాయపడినట్లు రష్యా అధికారులు తెలిపారు. అర్ధరాత్రి వేళ మాస్కో లక్ష్యంగా దూసుకొచ్చిన 81 డ్రోన్లను రష్యా వైమానిక రక్షణ దళాలు విజయవంతంగా అడ్డుకుని ధ్వంసం చేశాయి. దీంతో గత 24 గంటల్లో కూల్చివేసిన డ్రోన్ల సంఖ్య 120 దాటిందని మాస్కో మేయర్ సెర్గీ సోబియానిన్ వెల్లడించారు. గత ఏడాది కాలంలో ఉక్రెయిన్ జరిపిన అతిపెద్ద డ్రోన్ దాడి ఇదేనని ఆయన అభివర్ణించారు. ఈ దాడుల వల్ల మాస్కో చమురు శుద్ధి కర్మాగారానికి ఎలాంటి నష్టం వాటిల్లలేదని, దాని సాంకేతికత సురక్షితంగా ఉందని మేయర్ స్పష్టం చేశారు.
Сегодня в Подмосковье в результате атаки беспилотника погиб один гражданин Индии и ещё трое получили ранения. Сотрудники посольства выехали на место происшествия и навестили пострадавших в больнице.
Посольство выражает искренние соболезнования семье погибшего и делает всё… https://t.co/U6TaSVyj3E
— India in Russia (@IndEmbMoscow) May 17, 2026
అయితే, దాడి జరిగిన ప్రాంతానికి సమీపంలోని మూడు నివాస గృహాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దేశవ్యాప్తంగా రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ అలర్ట్ అయింది. గత 24 గంటల్లో మాస్కో సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో రష్యా సరిహద్దుల్లోకి దూసుకొచ్చిన మొత్తం 556 డ్రోన్‌లను కూల్చివేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ ఘటనతో రష్యా-ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరోసారి గరిష్ట స్థాయికి చేరాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
