AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సెల్ఫీల్లో విక్టరీ సైన్‌తో ఫోజులు కొడుతున్నారా ? ఊహించని ప్రమాదంలో పడినట్టే..! ఏఐ హ్యాకర్ల కొత్త ట్రిక్..

స్మార్ట్‌ఫోన్ల వాడకం పెరిగిన తర్వాత ప్రతి చిన్న విషయానికి సెల్ఫీలు దిగడం, వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడం ఒక ట్రెండ్‌గా మారింది. ముఖ్యంగా యువత ఫోటోలకు పోజులిచ్చేటప్పుడు చూపుడు వేలు, మధ్య వేలును పైకి లేపి విక్టరీ లేదా పీస్ (Peace) గుర్తును చూపించడం సర్వసాధారణం. అయితే, ఈ స్టైలిష్ పోజ్ మీ డిజిటల్ భద్రతకు పెద్ద ముప్పుగా మారుతోందని సైబర్ సెక్యూరిటీ నిపుణులు షాకింగ్ విషయాలను వెల్లడించారు.

సెల్ఫీల్లో విక్టరీ సైన్‌తో ఫోజులు కొడుతున్నారా ? ఊహించని ప్రమాదంలో పడినట్టే..! ఏఐ హ్యాకర్ల కొత్త ట్రిక్..
Ai Fingerprint HackingImage Credit source: freepik
Jyothi Gadda
|

Updated on: May 17, 2026 | 8:10 PM

Share

ఫోటోలు లేదా సెల్ఫీలు దిగేటప్పుడు రెండు వేళ్లు చూపిస్తూ విక్టరీ లేదా పీస్ సైన్ (Victory Sign) పెట్టడం మనకు అలవాటే. అయితే, ఈ చిన్న అలవాటు మీ బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసే ప్రమాదం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత సాయంతో హ్యాకర్లు మీరు సోషల్ మీడియాలో పెట్టే హై-క్వాలిటీ ఫోటోల నుండి మీ వేలిముద్రలను (Fingerprints) సులభంగా దొంగిలిస్తున్నారు. ఈ వేలిముద్రల ఆధారంగా మీ ఫోన్ బయోమెట్రిక్ లాక్‌లను అన్‌లాక్ చేయడంతో పాటు ఆధార్ ఆధారిత చెల్లింపులు, బ్యాంకింగ్ యాప్‌లను హ్యాక్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఫోటోలు దిగేటప్పుడు జాగ్రత్తగా ఉండటం అవసరం.

ఏఐ (AI) ద్వారా వేలిముద్రల చోరీ:

ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న స్మార్ట్‌ఫోన్లలో కెమెరాల నాణ్యత (Resolution) చాలా ఎక్కువగా ఉంటోంది. దీనికి తోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్ విపరీతంగా అభివృద్ధి చెందాయి. హ్యాకర్లు ఇప్పుడు ఈ టెక్నాలజీని ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు. మీరు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసే హై-రిజల్యూషన్ ఫోటోలను ఏఐ సాఫ్ట్‌వేర్ల సాయంతో జూమ్ చేసి, మీ వేళ్లపై ఉండే రేఖలను (Friction Ridges) స్క్యాన్ చేస్తున్నారు. తద్వారా మీ వేలిముద్రల (Fingerprints) యొక్క ఖచ్చితమైన క్లోనింగ్ లేదా త్రీడీ (3D) ప్రింట్‌ను వారు సిద్ధం చేసుకోగలుగుతున్నారు.

ఇవి కూడా చదవండి

జరిగే నష్టం ఏమిటి?:

ఈ రోజుల్లో మన డిజిటల్ జీవితమంతా బయోమెట్రిక్ డేటాపైనే ఆధారపడి ఉంది. ఫోన్ లాక్ స్క్రీన్ నుండి మొదలుకొని బ్యాంకింగ్ యాప్స్, యూపీఐ (UPI) పేమెంట్స్, ఆఫీస్ అటెండెన్స్ మరియు ఆధార్ కార్డ్ లింక్డ్ పేమెంట్ సిస్టమ్ (AEPS) వరకు అన్నింటికీ వేలిముద్రలనే కీలకంగా వాడుతున్నాం. హ్యాకర్లు మీ ఫోటోల ద్వారా సేకరించిన వేలిముద్రలను ఉపయోగించి మీ వ్యక్తిగత డేటాను దొంగిలించడమే కాకుండా, మీ బ్యాంక్ ఖాతాల్లోని సొమ్మును కూడా స్వాహా చేసే ప్రమాదం ఉంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

కెమెరాకు చాలా దగ్గరగా చేతులను చూపిస్తూ ఫోటోలు దిగడం ముప్పే. ఒకవేళ విక్టరీ సైన్ పెట్టాలనుకుంటే కెమెరాకు కనీసం 3 మీటర్ల దూరంలో ఉండాలి.

సోషల్ మీడియాలో ఫోటోలను అప్‌లోడ్ చేసే ముందు ప్రైవసీ సెట్టింగ్స్ చెక్ చేసుకోవాలి. మీ ఫోటోలు కేవలం స్నేహితులకు మాత్రమే కనిపించేలా చూసుకోవడం మంచిది.

బయోమెట్రిక్ లాక్‌లతో పాటు అదనపు భద్రత కోసం బలమైన పిన్ (PIN), పాస్‌వర్డ్ లేదా ఫేస్ ఐడి (Face ID) వంటి టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ను ఆన్ చేసి పెట్టుకోవాలి. సాంకేతికత పెరుగుతున్న కొద్దీ మన జాగ్రత్తలు కూడా మారకపోతే నష్టపోయే ప్రమాదం ఉంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల