AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బెంగళూరు, ముంబై కొత్త ఎక్స్‌ప్రెస్‌కు శ్రీకారం! త్వరలో వందే భారత్ స్లీపర్ సేవలు

కర్ణాటకలో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రం భారీగా నిధులు కేటాయించింది. అమృత్ భారత్ పథకం కింద 61 స్టేషన్లు పునరాభివృద్ధి చెందుతున్నాయి, 9 పూర్తియ్యాయి. బెంగళూరు సబర్బన్ రైల్వే, 12 వందే భారత్ రైళ్లు, 1750 కి.మీ కొత్త లైన్లు వేగంగా పురోగమిస్తున్నాయి.

బెంగళూరు, ముంబై కొత్త ఎక్స్‌ప్రెస్‌కు శ్రీకారం! త్వరలో వందే భారత్ స్లీపర్ సేవలు
Ashwini Vaishnaw
SN Pasha
|

Updated on: May 17, 2026 | 8:20 PM

Share

రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధికి గత కొన్ని సంవత్సరాల్లో కేంద్రం భారీగా నిధులు కేటాయించిందని, దాంతో కర్ణాటకలో అనేక ప్రాజెక్టులు వేగంగా పురోగమిస్తున్నాయని ఆయన చెప్పారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రాష్ట్రంలోని 61 రైల్వే స్టేషన్లను రూ.2,160 కోట్లతో పునరాభివృద్ధి చేస్తున్నామని, వాటిలో 9 స్టేషన్లు ఇప్పటికే పూర్తయ్యాయని తెలిపారు. బెంగళూరు కంటోన్మెంట్ స్టేషన్‌ను రూ.485 కోట్లతో, యశ్వంత్‌పూర్ స్టేషన్‌ను రూ.367 కోట్లతో ఆధునికీకరిస్తున్నట్లు వెల్లడించారు.

2014 తర్వాత కర్ణాటకలో సుమారు 1,750 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్లు నిర్మించామని, హాసన్ – మంగళూరు మార్గంలో క్లిష్టమైన విద్యుదీకరణ పనులు పూర్తి చేసి ప్రస్తుతం ట్రయల్స్ నిర్వహిస్తున్నామని తెలిపారు. బెంగళూరు సబర్బన్ రైల్వే ప్రాజెక్ట్‌లో నాలుగు కారిడార్లలో పనులు కొనసాగుతున్నాయని, బైయప్పనహళ్లి–చిక్కబనవర, హీలాలిగే–రాజనుకుంటె మార్గాల్లో భూసేకరణ పూర్తయిందని చెప్పారు. ఈ నెట్‌వర్క్ ద్వారా విమానాశ్రయం, ఎలక్ట్రానిక్ సిటీ, మారతహళ్లి, హెబ్బాల్ వంటి కీలక ప్రాంతాలు అనుసంధానమవుతాయని పేర్కొన్నారు. కర్ణాటకలో ప్రస్తుతం 12 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని, బెంగళూరు–మంగళూరు మార్గంలో కూడా పరీక్షలు కొనసాగుతున్నాయని తెలిపారు. భవిష్యత్తులో బెంగళూరును హైదరాబాద్, చెన్నై నగరాలతో బుల్లెట్ రైలు ద్వారా అనుసంధానించే ప్రణాళికలకు ఆమోదం లభించిందని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వీ.సోమన్న మాట్లాడుతూ.. కొత్త బెంగళూరు–ముంబై రైలు ప్రయాణికులకు ఎంతో ఉపయుక్తమవుతుందని అన్నారు. తానిసంద్రలో రూ.270 కోట్లతో వందే భారత్ స్లీపర్ మెయింటెనెన్స్ డిపో, SMVT బెంగళూరులో రూ.52.73 కోట్లతో చైర్ కార్ మెయింటెనెన్స్ సదుపాయం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి ఈసారి రికార్డు స్థాయిలో రూ.7,748 కోట్ల రైల్వే బడ్జెట్ కేటాయింపులు లభించాయని, కర్ణాటక త్వరలోనే 100 శాతం రైల్వే విద్యుదీకరణ సాధించే దిశగా ఉందని వెల్లడించారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us