MS Dhoni : ఎన్ఎస్‌జీ హబ్‌లో షూటింగ్‌తో అదరగొట్టిన మహీ.. అసలు గాయమైందా? లేక ఇదంతా చెన్నై మైండ్ గేమా?
MS Dhoni : ఎంఎస్ ధోనీ ఐపీఎల్ 2026లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోయినా, తాజాగా ఎన్ఎస్‌జీ హబ్‌లో షూటింగ్ చేస్తూ కనిపించడం కలకలం రేపుతోంది. ధోనీ ఫిట్‌నెస్‌పై సీఎస్‌కే ఫ్యాన్స్ మండిపడుతున్నారు. వీడియో చూస్తుంటే ధోనీ పూర్తిగా ఫిట్‌గానే ఉన్నాడని అర్థమవుతోంది.

MS Dhoni : ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంటున్నా, ఎంఎస్ ధోనీ మైదానంలోకి ఎప్పుడు వస్తాడనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. కనీసం ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే సీఎస్‌కే ఇప్పటికే 12 లీగ్ మ్యాచ్‌లను పూర్తి చేసేసింది. కాళ్ళ నొప్పితో ధోనీ ఆటకు దూరంగా ఉన్నాడని మేనేజ్‌మెంట్ చెబుతుంటే, బయట కనిపిస్తున్న దృశ్యాలు మాత్రం వేరేలా ఉన్నాయి. తాజాగా ధోనీ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (NSG) రీజినల్ హబ్‌లో సందడి చేయడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. అక్కడ ఆయన రైఫిల్ పట్టుకుని షూటింగ్ చేస్తూ కనిపించడంతో.. “ధోనీకి అసలు గాయమైందా లేక సీఎస్‌కే ఫ్యాన్స్‌తో ఆడుకుంటోందా?” అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.
మార్చి 28న ధోనీకి గాయమైందని, అందుకే రెండు వారాలు ఆటకు దూరంగా ఉంటాడని చెన్నై సూపర్ కింగ్స్ ప్రకటించింది. కానీ, ఆ రెండు వారాలు కాస్తా రెండు నెలలైపోయాయి. ఇప్పటికీ ఆయన ఎంట్రీపై క్లారిటీ లేదు. అయితే తాజాగా బయటకు వచ్చిన వీడియోలో ధోనీ ఎన్ఎస్‌జీ కమాండోలతో కలిసి తుపాకీ పట్టుకుని షూటింగ్ చేస్తూ చాలా ఉత్సాహంగా కనిపించారు. ఆయన బాడీ లాంగ్వేజ్‌లో ఎక్కడా గాయపడిన లక్షణాలు కనిపించలేదు. పైగా కమాండోలను సరదాగా “నేను ఫిట్‌గా కనిపిస్తున్నానా?” అని అడగడం చూస్తుంటే.. ధోనీ పూర్తిగా ఫిట్‌గానే ఉన్నాడని అర్థమవుతోంది.
Dhoni chat with NSG Commandos 🙏🏻
I’m i looking fit?😂😂🔥🔥pic.twitter.com/JMBnIGBOxU
— TELUGU MSDIANS🦁™ (@TeluguMSDians) May 17, 2026
ధోనీ నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న వీడియోలు, కీపింగ్ ప్రాక్టీస్ చేస్తున్న క్లిప్పింగ్‌లను సీఎస్‌కే సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంది. కానీ అసలు మ్యాచ్ వచ్చేసరికి ఆయన ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉండటం లేదు. దీంతో అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ధోనీని కేవలం బ్రాండ్ ప్రమోషన్ కోసం వాడుకుంటూ, ఆయన మ్యాచ్ ఆడుతాడనే ఆశతో ఫ్యాన్స్‌ను స్టేడియాలకు రప్పిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో (హైదరాబాద్, గుజరాత్) అయినా ధోనీ బ్యాట్ పడతాడా లేక ఈ సీజన్ మొత్తం డగౌట్‌కే పరిమితమవుతాడా అనేది చూడాలి.
MS Dhoni at NSG Commando 🔥🦁#MSdhoni pic.twitter.com/kqlkdDnKDO
— bhairava MSDian™ (@Bhairava_1) May 17, 2026
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ధోనీ తన ఫిట్‌నెస్ గురించి కమాండోలతో చర్చిస్తూ నవ్వులు పూయించారు. రైఫిల్ షూటింగ్ చేస్తున్నప్పుడు ఆయన ఫోకస్ చూసి కమాండోలు సైతం ఫిదా అయ్యారు. నేను ఫిట్‌గా ఉన్నానా? అని ఆయన అడిగిన ప్రశ్నకు కమాండోలు థంబ్స్ అప్ ఇచ్చారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం.. “షూటింగ్‌కు ఫిట్‌గా ఉన్న ధోనీ, ఐపీఎల్ ఆడటానికి మాత్రం అన్‌ఫిట్టా? ఏంటిది సీఎస్‌కే?” అంటూ ట్రోల్ చేస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
