డబ్బు ఆదా చేయడానికి స్మార్ట్ చిట్కాలు.. ఇలా చేస్తే మీ జేబులు ఎప్పుడూ నిండుగా ఉంటాయ్..!
ఈ రోజుల్లో డబ్బు ఆదా చేయడం కష్టంగా మారింది. నెలవారీ ఖర్చులు జేబులు ఖాళీ చేస్తున్నాయి. ఈ వార్త మీకు చాలా ముఖ్యం! మీ జేబు ఎప్పుడూ నిండుగా ఉండేందుకు, అనవసర ఖర్చులు తగ్గించుకోవడానికి, సరైన పొదుపు ప్రణాళికలు రూపొందించుకోవడానికి కొన్ని స్మార్ట్ చిట్కాలను అందిస్తుంది. OTT సబ్‌స్క్రిప్షన్‌లు, ఆన్‌లైన్ చెల్లింపుల నియంత్రణ వంటి సూచనలతో మీ ఆర్థిక భవిష్యత్తును మెరుగుపరచుకోండి.

ఈ రోజుల్లో డబ్బు సంపాదించడం ఎంత కష్టంగా మారిందో.. దాన్ని ఆదా చేయడం కూడా అంతే కష్టంగా మారుతోంది. డబ్బు ఆదా చేయడం అంతకంతకూ కష్టమవుతోంది. నెలవారీ ఖర్చులు, నెలాఖరు నాటికి చాలా మందికి జేబులు ఖాళీ అవుతున్నాయి.. మీరు కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారా..? పొదుపు చేయడానికి ఇబ్బంది పడుతున్నట్టయితే ఈ వార్త మీకు చాలా ముఖ్యం. ఈ రోజు మనం డబ్బు ఆదా చేయడానికి, మీ జేబులు ఎప్పుడూ నిండుగా ఉండేందుకు సహాయపడే కొన్ని స్మార్ట్ చిట్కాలను తెలుసుకుందాం.
మీ నెలవారీ ఖర్చులు ఎంత ఉన్నా, తక్కువ మొత్తంలో ఖచ్చితంగా ఆదా చేయాలి. దాని కోసం మీరు ముందుగానే మీ లక్ష్యాలను నిర్దేశించుకుని వాటికి కట్టుబడి ఉండండి. మీ అవసరాలు ఏంటి..? మీరు ఏం కొనాలనుకుంటున్నారో ముందుగానే ప్లాన్ చేసుకోండి..అనవసరమైనవి, విలాసవంతమైనవి కొనకుండా ఉండండి. మీ పొదుపును మంచి పెట్టుబడి పథకంలో పెట్టుబడి పెట్టండి. అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోండి.
OTT సబ్‌స్క్రిప్షన్‌లను నివారించండి:
చాలా మందికి అనేక రకాల సబ్‌స్క్రిప్షన్‌లు ఉన్నాయి. వాటిలో కొన్ని పనికిరానివి కూడా ఉన్నాయి. కాబట్టి, అనవసరమైన సబ్‌స్క్రిప్షన్‌లను నివారించండి. పొదుపుపై దృష్టి పెట్టండి.
అనవసర ఖర్చులను తగ్గించుకోండి:
తరచుగా బయట తినడం, ప్రతి వారం ప్రయాణాలకు వెళ్లడం లేదా ఖరీదైన వస్తువులు కొనడం మానేయండి. అవసరమైన ఖర్చులకు మాత్రమే ఖర్చు చేయండి.
మీ ఆదాయంతో పాటు మీ ఖర్చులను పెంచుకోకండి:
మీ ఆదాయం పెరుగుతున్నట్లయితే, మీ ఖర్చులను పెంచుకోకండి. మీ జీవనశైలిని మార్చుకోకండి. ముందుగా పొదుపుకు ప్రాధాన్యత ఇవ్వండి.
ఆన్‌లైన్ చెల్లింపులకు బదులుగా నగదును ఉపయోగించండి:
ఈ రోజుల్లో ప్రజలు ఎక్కువగా ఆన్‌లైన్ చెల్లింపుల కోసం UPIని ఉపయోగిస్తున్నారు. దీని వలన ఖర్చు పెరుగుతోంది. కాబట్టి, దీన్ని తగ్గించి నగదును ఉపయోగించడానికి ప్రయత్నించండి. నగదును ఉపయోగించడం వల్ల నేరుగా డబ్బు ఒకరి నుండి మరొకరికి బదిలీ అవుతుంది. ఇది మీ ఖర్చులను తగ్గించునేలా చేస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








