Financial Tasks: అలర్ట్.. ఏప్రిల్ 30లోపు ఈ కీలకమైన ఆర్థిక పనులను తప్పకుండా పూర్తి చేసుకోండి.. లేకపోతే..

Financial Tasks: దేశ వ్యాప్తంగా కరోనా మహహ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దీంతో ప్రభుత్వాలు లాక్‌డౌన్‌, నైట్‌ కర్ఫ్యూలు విధిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఇళ్లకే పరిమితం..

Financial Tasks: అలర్ట్.. ఏప్రిల్ 30లోపు ఈ కీలకమైన ఆర్థిక పనులను తప్పకుండా పూర్తి చేసుకోండి.. లేకపోతే..
Follow us
Subhash Goud

|

Updated on: Apr 27, 2021 | 6:19 PM

Financial Tasks: దేశ వ్యాప్తంగా కరోనా మహహ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దీంతో ప్రభుత్వాలు లాక్‌డౌన్‌, నైట్‌ కర్ఫ్యూలు విధిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో మనం పూర్తి చేయాల్సిన కొన్ని కీలకమైన ఆర్థిక పనులు మర్చిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి పనుల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా ముందస్తుగా గుర్తించుకుని పూర్తి చేస్తే మేలు. లేకపోతే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకే ఏప్రిల్‌ 30 లోపు పూర్తి చేసే పనులపై దృష్టి సారించండి.

ఫారమ్‌లను 15హెచ్‌, 15జి సమర్పించడం

వడ్డీ ఆదాయంపై టీడీఎస్‌ను నివారించేందుకు 60 ఏళ్ల లోపు వారు ఫారం 15జి, 60 ఏళ్లు పైబడిన సీనియర్‌ సిటిజన్స్‌ ఫారం15 హెచ్ సమర్పించాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి మొత్తం ఆదాయం రూ.2.5 లక్షలోపు ఉంటే.. అతడు టిడిఎస్ మినహాయింపును కోరడానికి తన బ్యాంకులో ఫారం 15 జిని సమర్పించాల్సి ఉంటుంది. ఇది వార్షిక ప్రక్రియ. దీనిని ప్రతి సంవత్సరం చేయాల్సి ఉంటుంది. అయితే చాలా బ్యాంకులు ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఫారం 15 హెచ్/15జి సమర్పించడానికి అనుమతి ఇస్తున్నాయి. ఈ కరోనా మహమ్మారి సమయంలో ఇంటి నుంచి బయటికు వెళ్లకుండానే ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ఇప్పటికీ ఈ పని పూర్తి చేయకపోతే ఏప్రిల్ 30లోపు చేసుకోండి.

ట్యాక్స్ ప్లాన్‌

ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ప్రారంభమైన 2021–22 కొత్త ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పుడే పన్ను ప్రణాళికను సిద్దం చేసుకోవాలని ఫైనాన్షియల్ ప్లానర్లు సూచిస్తున్నారు. దీని కోసం ఆర్థిక సంవత్సరం చివరి వరకు వేచి చూడకూడదని సలహా ఇస్తున్నారు. దీని వల్ల నష్టపోయే అవకాశాలు అధికమని సూచిస్తున్నారు. పన్ను ఆదా ప్రయోజనం కోసం ELSS నిధులలో పెట్టుబడులు పెట్టాలి అనుకునేవారు.. ఈ నెల నుంచే ELSS పథకంలో SIPని ప్రారంభించండి. అలా చేయడం ద్వారా ఎక్కువ ప్రయోజనాన్ని పొందవచ్చు.

పీఎఫ్ కంట్రిబ్యూషన్​ను మార్చండి

ప్రావిడెంట్ ఫండ్ కంట్రిబ్యూషన్​పై కొత్త పన్ను నియమాలను చేర్చింది కేంద్రం ప్రభుత్వం. ఈ నియమాలు 2021 ఏప్రిల్ 1 నుంచి అమల్లో ఉంటాయి. సంవత్సరానికి రూ .2.5 లక్షలకు పైబడిన కంట్రిబ్యూషన్స్​పై వచ్చే వడ్డీపై ఇప్పుడు పన్ను విధిస్తారు. మీరు ఈపీఎఫ్‌, వీపీఎస్‌ లేదా రెండింటి ద్వారా ప్రావిడెంట్ ఫండ్‌లో రూ .2.5 లక్షలకు పైగా పెట్టుబడి పెడుతుంటే, దానిపై టాక్స్​ తగ్గించుకోవడానికి మీ వాటా తగ్గించమని యాజమాన్యాన్ని కోరండి.

పీపీఎఫ్ ఖాతా తెరవండి

మీకు ఇంకా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్‌) ఖాతా లేకపోతే, త్వరగా పీపీఎఫ్‌ ఖాతా ఓపెన్‌ చేయండి. అధిక పన్ను పరిధిలోకి వచ్చే పెట్టుబడిదారులు ప్రావిడెంట్ ఫండ్ కంటే పీపీఎఫ్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా అధిక రాబడిని పొందగలరు. దీనిపై సుమారు 7.1% పన్ను రహిత వడ్డీ లభిస్తుంది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌తో సహా చాలా ప్రైవేట్ బ్యాంకులు ఆన్‌లైన్‌లో పీపీఎఫ్‌ ఖాతాను తెరవడానికి అనుమతిస్తాయి.

చిన్న పొదుపు పథకాల్లో పెట్టుబడి

చిన్న పొదుపు పథాకాలపై లభించే వడ్డీని తగ్గించాలనే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గింది. వచ్చే మూడు నెలల పాటు పాత వడ్డీ రేట్లే అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. అయితే ఈ నిర్ణయం తాత్కాలికం మాత్రమే. వచ్చే త్రైమాసికం నుంచి తగ్గే అవకాశం ఉంది. జూలై 1వ తేదీ నుంచి చిన్న పొదుపు పథకాలపై రేట్లు తగ్గించే అవకాశం ఉన్నప్పటికీ, పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్​కమ్​ స్కీమ్​, కిసాన్ వికాస్ పత్ర, ఎన్ఎస్​సీలు, సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ వంటి కొన్ని పథకాలలో ఇప్పుడు త్రైమాసికంలో పెట్టుబడి పెడితే, వాటి మెచ్యూరిటీ తీరే వరకు అధిక వడ్డీరేట్లను పొందవచ్చు. కాబట్టి వీలైనంత త్వరాగా చిన్న పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టడం మంచిది.

ఇవీ చదవండి: Indane Gas Booking: మీరు గ్యాస్‌ సిలిండర్ బుక్‌ చేస్తున్నారా..? ఈ నెంబర్‌ చెబితేనే గ్యాస్‌ డెలివరి అవుతుంది..!

Flipkart Big Saving Days Sale: ఫ్లిప్​కార్ట్ సమ్మర్​ స్పెషల్ సేల్​.. భారీ డిస్కౌంట్‌.. ఎప్పటి నుంచి అంటే..!

పరిశ్రమలపై మళ్లీ కరోనా పిడుగు.. ప్లాస్టిక్‌, సిమెంట్‌, స్టీల్‌ ధరలకు రెక్కలు..కోవిడ్‌తో ముడిసరుకుపై తీవ్ర ప్రభావం

గతంలో ఒక మంత్రిగా, ప్రభుత్వంలో నిర్ణయం తీసుకున్నా: కేటీఆర్
గతంలో ఒక మంత్రిగా, ప్రభుత్వంలో నిర్ణయం తీసుకున్నా: కేటీఆర్
బాబర్ ఆజమ్ Vs ముల్డర్: కేప్ టౌన్ టెస్టులో రికార్డులు, వివాదాలు!
బాబర్ ఆజమ్ Vs ముల్డర్: కేప్ టౌన్ టెస్టులో రికార్డులు, వివాదాలు!
తెలంగాణలోనూ సినిమా టికెట్ రేట్ల పెంపు! దిల్ రాజు కీలక ప్రకటన
తెలంగాణలోనూ సినిమా టికెట్ రేట్ల పెంపు! దిల్ రాజు కీలక ప్రకటన
పంట పొలంలో ప్రత్యక్షమైన జింకపిల్ల..కుక్కల దాడి నుంచి కాపాడిన
పంట పొలంలో ప్రత్యక్షమైన జింకపిల్ల..కుక్కల దాడి నుంచి కాపాడిన
40 గంటల పాటు యూట్యూబర్ కు చుక్కలు..బాధితుడిసెల్ఫ్‌ వీడియో రిలీజ్
40 గంటల పాటు యూట్యూబర్ కు చుక్కలు..బాధితుడిసెల్ఫ్‌ వీడియో రిలీజ్
డాడీ మూవీ బాలనటి లేటెస్ట్ లుక్ స్టన్నింగ్ అంతే..
డాడీ మూవీ బాలనటి లేటెస్ట్ లుక్ స్టన్నింగ్ అంతే..
అయ్యో విశాల్‌కు ఏమైంది? వణికిపోతూ గుర్తుపట్టలేని స్థితిలో..వీడియో
అయ్యో విశాల్‌కు ఏమైంది? వణికిపోతూ గుర్తుపట్టలేని స్థితిలో..వీడియో
భారత్‌లో తొలి HMPV కేసు..? బెంగళూరులో గుర్తింపు
భారత్‌లో తొలి HMPV కేసు..? బెంగళూరులో గుర్తింపు
తోపులైనా, తరుములైనా జాన్తానై.. నాకు కావాల్సింది అదే: గంభీర్
తోపులైనా, తరుములైనా జాన్తానై.. నాకు కావాల్సింది అదే: గంభీర్
భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ