AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI Clerk Notification 2021: నిరుద్యోగులకు శుభవార్త.. ఎస్‌బీఐలో 5వేల ఉద్యోగాలు.. చివరి తేదీ ఎప్పుడంటే..?

SBI Clerk Notification 2021: కరోనా కాలంలో.. దేశంలోని అతిపెద్ద బ్యాంక్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఎస్‌బీఐ

SBI Clerk Notification 2021: నిరుద్యోగులకు శుభవార్త.. ఎస్‌బీఐలో 5వేల ఉద్యోగాలు.. చివరి తేదీ ఎప్పుడంటే..?
Shaik Madar Saheb
|

Updated on: Apr 27, 2021 | 2:22 PM

Share

SBI Clerk Notification 2021: కరోనా కాలంలో.. దేశంలోని అతిపెద్ద బ్యాంక్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఎస్‌బీఐలోని వివిధ బ్రాంచీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఎస్‌బీఐ క్లర్క్ నోటిఫికేషన్‌‌ను విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 5 వేల ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో కర్క్‌ పోస్టులతోపాటు క్లరికల్‌ క్యాడర్‌లో జూనియర్‌ అసోసియేట్‌ (కస్టమర్‌ సపోర్ట్‌ అండ్‌ సేల్స్‌) పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులకు స్థానిక భాష తెలిసి ఉండాలని.. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరింది. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 27నుంచి ప్రారంభమై మే నెల 17తో ముగుస్తుందని పేర్కొంది.

వివరాలు..

అర్హతలు: ఏదైనా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. వయస్సు: అభ్యర్థుల వయస్సు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. (1993, ఏప్రిల్‌ 2 నుంచి 2021, ఏప్రిల్‌ 1 మధ్య జన్మించి ఉండాలి) ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్‌ రాతపరీక్ష. పరీక్ష ప్రిలిమినరీ, మెయిన్స్‌ ద్వారా ఎంపిక చేస్తారు. ఫీజు: రూ. 750. రిజర్వుడ్ కేటగిరికి చెందిన అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది. అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్‌ 27 దరఖాస్తులకు చివరితేదీ: మే 17 ప్రిలిమినరీ పరీక్ష: జూన్‌ లో మెయిన్‌ ఎగ్జామ్‌: జూలై 31 వెబ్‌సైట్‌: https://www.sbi.co.in/careers

పరీక్ష విధానం ప్రిలిమినరీ.. మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ప్రశ్నలు అన్ని ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటాయి. నిర్ణీత సమయంలోపు సెక్షన్‌ను పూర్తిచేయాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించినవారు మెయిన్స్‌ పరీక్షకు అర్హత ుంటుంది. దీనిని 200 మార్కులకు నిర్వహిస్తారు.

Also Read:

Viral News: ఒకేసారి 35 మంది యువతులతో డేటింగ్ చేసిన యువకుడు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

Maruti Alto 800: బంపర్ ఆఫర్.. 4లక్షల కారు.. లక్షా ముప్పై వేలకే.. సామాన్యులకు అందుబాటులో…