Maruti Alto 800: బంపర్ ఆఫర్.. 4లక్షల కారు.. లక్షా ముప్పై వేలకే.. సామాన్యులకు అందుబాటులో…
Maruti Alto 800 LXI: అసలే కరోనా కాలం.. వేధిస్తున్న ఆర్థిక పరమైన పరిస్థితులు.. ఈ క్రమంలో కారు కొనలేకపోతున్న వారికి దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి శుభవార్త అందిస్తోంది. తమ కంపెనీ ద్వారా
Maruti Alto 800 LXI: అసలే కరోనా కాలం.. వేధిస్తున్న ఆర్థిక పరమైన పరిస్థితులు.. ఈ క్రమంలో కారు కొనలేకపోతున్న వారికి దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి శుభవార్త అందిస్తోంది. తమ కంపెనీ ద్వారా సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేసే సదుపాయాన్ని కల్పిస్తోంది. అది కూడా మంచి మంచి ఆఫర్లతో విక్రయిస్తోంది. దీని ద్వారా మీరు అతి తక్కువ ధరకే కారును సొంతం చేసుకోవచ్చు. చాలా తక్కువ ధరకు కారును సొంతం చేసుకోవచ్చని మారుతి వెల్లడించింది. దీనిలో భాగంగా మారుతి సుజుకి ట్రూ వాల్యూ (Maruti Suzuki true value) ద్వారా సెకెండ్ హ్యాండ్ కార్లను వినియోగదారులకు విక్రయిస్తోంది. ఈ కార్లను టెస్ట్ డ్రైవ్ చేసి డీలర్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. అయితే తాజాగా మారుతి సుజుకి నాలుగు లక్షల విలువైన కారు ఆల్టో 800 ఎల్‌ఎక్స్ఐ ను 1.30లక్షలకే అందుబాటులో ఉంచింది. ప్రస్తుతం మార్కెట్లో ఈ కారు ఆన్ రోడ్ ధర 4 లక్షల రూపాయల వరకు ఉంది.
ఈ ఆల్టో 800 ఎల్‌ఎక్స్ఐ కారును మారుతి సెకండ్ హ్యాండ్ ట్రూ వాల్యూ వెబ్‌సైట్‌లో విక్రయిస్తున్నట్లు వెల్లడించిది. ఈ కారును మారుతి సుజుకి.. జెన్యూన్ పార్ట్స్‌తో రీ మోడల్ సైతం చేసింది. మీరు దీనిని కొనుగోలు చేయడం ద్వారా మూడుసార్లు ఫ్రీ సర్వీసింగ్ సేవలతో పాటు.. మీరు 6 నెలల వారంటీ కూడా లభిస్తుంది.
కారు మోడల్, తదితర విషయాలు..
మారుతి సుజుకి ట్రూ వాల్యూ వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఈ కారు 2016 మోడల్, దీంతోపాటు పెట్రోల్ ఇంజన్. ఈ కారు ఇప్పటివరకు మొత్తం 60,941 కిలోమీటర్లు నడిచింది. దీని రంగు తెలుపు. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ రేటింగ్ తో వస్తుంది. ఒకవేళ మీకు కారు నచ్చితే.. ట్రూ వాల్యూలో మీ వివరాలు.. మొబైల్ నంబర్, ఇమెయిల్ పొందుపరచడం ద్వారా.. మీకు మరింత సమాచారం లభిస్తుంది. దీంతోపాటు టెస్ట్ డ్రైవ్ బుక్ చేసుకోవచ్చు, డీలర్‌ను కూడా సంప్రదించవచ్చు. దీంతోపాటు మీరు ఈ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా మరింత సమాచారం పొందవచ్చు (https://www.marutisuzukitruevalue.com/buy-car/alto-800-in-ajmer-2016/AXerHbHUNiwKO4z0Jo0L).
Also Read: