AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Govt.: తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదిక.. కోవిడ్ కట్టడికి చేపడుతున్న చర్యలు వివరించిన సర్కార్

రాష్ట్రంలో చేపడుతున్న కొవిడ్‌ పరీక్షల వివరాలను, కరోనా కట్టడికి చేపడుతున్న చర్యలు, ఇతర అంశాలను ప్రభుత్వం.. రాష్ట్ర హైకోర్టుకు వివరించింది.

TS Govt.: తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదిక..  కోవిడ్ కట్టడికి చేపడుతున్న చర్యలు వివరించిన సర్కార్
High Court
Balaraju Goud
|

Updated on: Apr 27, 2021 | 1:30 PM

Share

TS Govt. report to high court:  తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టుకు ప్రభుత్వం నివేదిక అందజేసింది. రాష్ట్రంలో చేపడుతున్న కొవిడ్‌ పరీక్షల వివరాలను, కరోనా కట్టడికి చేపడుతున్న చర్యలు, ఇతర అంశాలను ప్రభుత్వం వివరించింది. ఆ రిపోర్ట్‌ ప్రకారం..రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 3.5 శాతంగా ఉంది. 25వ తేదీ వరకు 23 లక్షల 55 వేల టెస్టులు చేశారు. ఈనెల 1నుంచి 25 వరకు కోవిడ్‌తో 341 మంది మృతి చెందారు. కరోనా టెస్టులు పెంచేందుకు చర్యలు చేపడుతున్నామన్న ప్రభుత్వం… రెమ్‌డెసివిర్‌ పర్యవేక్షణ నోడల్‌ అధికారిగా ప్రీతిమీనాను నియమించినట్టు హైకోర్టుకు తెలిపింది. వైన్‌షాపులు, పబ్‌ల్లో నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకున్నట్టు రిపోర్ట్‌లో వివరించారు.

ఈ నెల 1 నుంచి 25 వరకు రాష్ట్రంలో మొత్తం 23.55 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించామని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. వీటిలో 4.39 లక్షల ఆర్టీపీసీఆర్‌, 19.16లక్షల ర్యాపిడ్‌ పరీక్షలు చేశామని వెల్లడించింది. కరోనా పరీక్షల పెంపునకు చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేసింది. కాగా, ఈ నెల 1 నుంచి 25 వరకు కరోనా బారిన పడి 341 మంది మృతి చెందినట్లు తెలిపింది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ రేటు 3.5 శాతం ఉందని వెల్లడించింది.

ఇక, కరోనాపై నిపుణుల కమిటీ సమావేశాలు ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయని.. కరోనా కట్టడి కోసం రాష్ట్రంలో మద్యం దుకాణాలు, పబ్‌లు నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకున్నామన్నారు. మద్యం దుకాణాలను అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నామని వివరించారు. కోవిడ్ నిబంధనలను పక్కా గా అమలు చేస్తున్నామని వెల్లడించింద. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.

కాగా, కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలు ప్రయత్నిస్తోందని నివేదించింది. ఇందులో భాగంగా రాష్ట్రానికి 430 టన్నుల ఆక్సిజన్‌ను కేంద్రం కేటాయించిందని తెలిపింది. వివిధ ప్రాంతాల నుంచి ఆక్సిజన్‌ను చేరవేస్తున్నామని ఇందుకు రక్షణ శాఖ సహాయం కూడా తీసుకుంటున్నట్లు తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లో అందించే రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్ల పంపిణీ కోసం పర్యవేక్షణ నోడల్‌ అధికారిగా ప్రీతిమీనాను నియమించామని రాష్ట్ర ప్రభుత్వం.. హైకోర్టుకు నివేదించింది.

Read Also…  కరోనా అలర్ట్..! పడుకునే పద్దతి ద్వారా ఆక్సిజన్ లెవల్స్ పెంచుకోవచ్చు.. ఎలాగో మీరే తెలుసుకోండి..