TRS Formation Day: రాష్ట్రంలో నిరాడంబరంగా టీఆర్ఎస్ 20వ ఆవిర్భావ వేడుక‌లు.. తెలంగాణ భ‌వ‌న్‌లో పార్టీ సెక్రెటరీ జనరల్ కేకే

తెలంగాణ భ‌వ‌న్‌లో టీఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ వేడుక‌లు నిరాడంబరంగా జరుగాయి.. కరోనా నిబంధనలు పాటిస్తూ పార్టీ నేతలు వేడుకలు నిర్వహించారు.

TRS Formation Day: రాష్ట్రంలో నిరాడంబరంగా టీఆర్ఎస్ 20వ ఆవిర్భావ వేడుక‌లు.. తెలంగాణ భ‌వ‌న్‌లో పార్టీ సెక్రెటరీ జనరల్  కేకే
Trs Party 20th Formation Day Celebrations
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 27, 2021 | 1:06 PM

TRS formation day celebrations: తెలంగాణ భ‌వ‌న్‌లో టీఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ వేడుక‌లు నిరాడంబరంగా జరుగాయి.. కరోనా నిబంధనలు పాటిస్తూ పార్టీ నేతలు వేడుకలు నిర్వహించారు. హైదరాబాద్లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో .. పార్టీ సెక్రెటరీ జనరల్ కేశవరావు జెండా అవిష్కరించారు. తెలంగాణ కలలను సాకారం చేసిన ఘనత కేసీఆర్‌దేనని అన్నారాయన. ప్రతికూల పరిస్థితుల్లో పార్టీ పెట్టి.. కేంద్రాన్ని ఒప్పించి రాష్ట్రాన్ని తెచ్చారని కొనియాడారు. అంతకు ముందు తెలంగాణ త‌ల్లి విగ్రహం, ఆచార్య జ‌య‌శంక‌ర్ విగ్రహానికి కేకే పూలమాల వేసి నివాళుల‌ర్పించారు.

టీఆర్‌ఎస్ నాయకులకు, కార్యకర్తలకు 20వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి కేటీఆర్. రానే రాదు అనుకున్న తెలంగాణను సాధించి ఘనత టీఆర్‌ఎస్ పార్టీకే దక్కిందన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశంలో అనతి కాలంలోనే అభివృద్ధి చెందిందని అన్నారు.

మిగతా రాష్ట్రాలతో పోటీ పడుతూ ముందుకు సాగుతోందన్నారు మంత్రి హరీశ్ రావు.పెద్ద ఎత్తున జరుపుకోవాల్సిన పార్టీ ఆవిర్భావ వేడుకలు.. కరోనా కారణంగా వాయిదా వేసుకున్నట్టు తెలిపారాయన. కరోనా తగ్గాక పెద్దఎత్తున వేడుకలను నిర్వహిస్తామన్నారు మంత్రి హరీష్.

పార్టీ కార్యకర్తలకు ఎమ్మెల్సీ కవిత శుభకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల కోసం జీవితాన్ని త్యాగం చేసే స్థాయికి వెళ్లిన.. కేసీఆర్‌కు సెల్యూట్ అంటూ ట్వీట్ చేశారు కవిత.

Read Also…Kaleshwara Temple: కరోనా ఎఫెక్ట్.. రేపటి నుంచి కాళేశ్వర ఆలయంలో దర్శనాలు రద్దు.. ఎప్పటివరకంటే..?