Kaleshwara Temple: కరోనా ఎఫెక్ట్.. రేపటి నుంచి కాళేశ్వర ఆలయంలో దర్శనాలు రద్దు.. ఎప్పటివరకంటే..?
Kaleshwara Mukteswara Swamy Temple: తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఇటీవల పదివేలకు పైగా కోవిడ్ కేసులు, 50కి పైగా
Kaleshwara Mukteswara Swamy Temple: తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఇటీవల పదివేలకు పైగా కోవిడ్ కేసులు, 50కి పైగా మరణాలు సంభవిస్తున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వం అప్రమత్తమై రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలుచేస్తోంది. కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఇప్పటికే పలు దేవాలయాల్లో దర్శనాలు సైతం నిలిపివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకుంటున్నారు. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం యంత్రాంగం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 28వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు స్వామి వారి దర్శనాలు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో, జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ దేవస్థానం అధికారులు వెల్లడించారు. అయితే.. స్వామివారికి అర్చకులు నిత్యం పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారని వెల్లడించారు. ఇప్పటికే ఇద్దరు ఆలయ సిబ్బంది, ఓ అర్చకుడు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయని.. అలాగే గ్రామంలో 50కిపైగా కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. రాష్ట్రంతోపాటు.. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి ఎక్కువగా భక్తులు వస్తున్నందున కరోనా వ్యాప్తికి అవకాశం ఉండడంతో భక్తులకు దర్శనం నిలిపివేస్తున్నట్లు వివరించారు.
ఇదిలాఉంటే.. తెలంగాణలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. సోమవారం 10,122 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు నిన్న ఒక్కరోజే 52 మంది మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,11,905కి చేరగా.. మరణాల సంఖ్య 2,094కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 69,221 యాక్టివ్ కేసులున్నాయి.
Also Read: