AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా నుంచి మీ ఊపిరితిత్తులను ఇలా కాపాడుకోండి..! ఇక ఏ వైరస్ మిమ్మల్ని అటాక్ చేయదు.. తెలుసుకోండి..?

Lifespan of Lungs : కరోనా వైరస్ వల్ల దేశం మొత్తం అతలాకుతలమవుతుంది.. ప్రతి ఒక దగ్గర కరోనా ప్రమాదం పొంచి ఉంది. ఇటువంటి సందర్భంలో

కరోనా నుంచి మీ ఊపిరితిత్తులను ఇలా కాపాడుకోండి..! ఇక ఏ వైరస్ మిమ్మల్ని అటాక్ చేయదు.. తెలుసుకోండి..?
111
uppula Raju
| Edited By: Team Veegam|

Updated on: Apr 27, 2021 | 7:18 PM

Share

Lifespan of Lungs : కరోనా వైరస్ వల్ల దేశం మొత్తం అతలాకుతలమవుతుంది.. ప్రతి ఒక దగ్గర కరోనా ప్రమాదం పొంచి ఉంది. ఇటువంటి సందర్భంలో మనల్ని మనం కాపాడుకోవడం చాలా ముఖ్యం. అందుకోసం కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలి అలాగే ఒకవేళ కరోనా వచ్చినా ఎలా తట్టుకోవాలో ముందస్తుగా శరీరాన్ని సిద్దం చేయాలి.. ముఖ్యంగా కరోనా వైరస్ శరీరంలో శ్వాస వ్యవస్థపై బలంగా దెబ్బ తీస్తుంది. దీంతో మనిషికి ఉన్నపలంగా ఆక్సిజన్ అవసరమవుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే ముందస్తుగా మన శరీరంలోని ఊపిరితిత్తులను బలంగా చేసుకోవాలి.. ఏ వైరస్ వచ్చినా తట్టుకొని నిలబడేలా చూసుకోవాలి..

అందుకోసం ప్రాణాయామం చక్కగా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు ముప్పై నిమిషాల పాటు ప్రాణాయామం చేస్తే ఏ కరోనా మిమ్మల్ని ఏం చేయదు.. ప్రాణాయామం అనగా శ్వాస తీసుకోవటం, కుంభించటం, వదలడం ఒక క్రమ పద్దతిలో చేయడం. దీనివల్ల శరీరంలోని చెడు వాయువు బయటికి పోతుంది. ప్రాణ వాయువు శరీరంలోకి వస్తుంది. దీనివల్ల బాడీ ఉత్తేజితమవుతుంది. రక్తం శుభ్రపడుతుంది. నరాలకు బలం కలుగుతుంది. ప్రాణయామం సాధన చేయడానికి మూడు పద్దతులు ఉన్నాయి.

1. అధమ (ఉదర శ్వాస)- చిన్ ముద్ర వజ్రాసనంలో కూర్చొని నిరంతరాయంగా ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీసుకోండి. దీన్నే పూరక అంటారు. ఉదర కింది భాగం ఉబ్బేట్టుగా అంటే కింది ఊపిరితిత్తులోకి శ్వాస తీసుకోవాలి. శ్వాస వెలుపలికి విడిచే ముందర కొంతసేపు అలాగే ఉండండి.. వెలుపలికి శ్వాస విడిచేటపుడు నెమ్మదిగా పొట్టలోకి తీసుకోవాలి. మళ్లీ శ్వాస లోనికి తీసుకోవటానికి ముందు కొద్ది క్షణాలు అలాగే ఉండి.. అప్పుడు లోపలికి శ్వాస తీసుకోవాలి. నెమ్మదిగా ఇదే ప్రక్రియను మళ్లీ మళ్లీ చేయాలి..

2. మధ్యమ (ఛాతి శ్వాస)- చిన్మయి ముద్ర తప్పనిసరి.. వజ్రాసనంలో కూర్చొని ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీసుకోండి. ఈ పద్దతిలో శ్వాస తీసుకునేటప్పుడు కేవలం ఛాతి మాత్రమే ఉపయోగించాలి. శ్వాసను ముక్కు రంధ్రాల గుండా వదలాలి. పొట్టభాగం అసలు కదలకూడదు.

3. ఆద్య (స్కంధ శ్వాస)- ఆది ముద్ర వజ్రాసనంలో కూర్చొని శ్వాస తీస్తూ భుజాలు పైకి లేపండి.. ఊపిరిని పైనున్న ఊపిరితిత్తులలోకి నింపండి. చాలా అరుదుగా వాడే ఈ భాగం ఇందువల్ల సక్రమంగా పనిచేస్తుంది.

4. పూర్ణయోగ శ్వాసక్రియ- బ్రహ్మ ముద్ర అధమ, మధ్యమ, ఆద్య అని పిలువబడే ఈ మూడు విధాలు కలిపి చేయటమే పూర్ణయోగ శ్వాసక్రియ. శ్వాస తీసుకునేటపుడు వరుసగా అధమ, మధ్యమ, ఆద్య క్రియలు వరుసగా జరుగుతాయి.

ఈ ప్రక్రియల వల్ల ఊపిరితిత్తులు పూర్తి సామర్థ్యంతో గాలిని తీసుకోగలుగుతాయి. క్రమబద్ధమైన బలమైన ఉచ్ఛ్వాస నిశ్వాసలు జీర్ణకోశాన్ని ఒత్తిడి చేసి, సరైన జీర్ణక్రియ జరిగేలా చూస్తాయి. ఇలా చేయడం వల్ల రక్తప్రసరణ కూడా మెరుగవుతుంది. మధ్య ఊపిరితిత్తులు కూడా వ్యాకోచం చెందుతాయి.

Read also: ఊపిరి బిగ బెట్టండి.. అంతే.. మీకు కరోనా ఉందో లేదో తెలిసిపోతుంది..వీడియో వైరల్.. మరి అందులో నిజమెంత?

ఈనెల 28 నుంచి జూన్‌ 1 వరకు పలు రైళ్లు రద్దు: ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

SBI ఖాతాదారులరా అలర్ట్.. కస్టమర్లకు కీలక ప్రకటన చేసిన బ్యాంక్.. ఏం చెప్పిందంటే..

 ఏపీ సర్కార్ వినూత్న ప్రయోగం.. ఆసుపత్రి అవసరం లేకుండానే చికిత్స.. ఇంటింటికి కరోనా కిట్లు..!