గుడ్ న్యూస్.. కరోనాలా హంటా వైరస్ కాదట… అసలు నిజమిదే.!

కరోనా వైరస్‌తో ప్రపంచమంతా వణికిపోతుంటే కొత్తగా హంటా వైరస్ వచ్చిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ వైరస్ కూడా ప్రజలను చంపేస్తుందని పుకార్లు వస్తున్నాయి. అయితే అది నిజం కాదు. హంటా అనేది కేవలం ఎలుకల ద్వారా వచ్చేది మాత్రమే కానీ అంటువ్యాధి కాదు. ఎలుకలు తిన్న ఆహారాన్ని తినడం లేదా.. ఈ వైరస్ వచ్చిన ఎలుకలు మనుషుల్ని కొరకడం, ఎలుకల వ్యర్ధాలు తిన్నా ఈ వైరస్ పాకుతుంది. అంటే తప్ప అందరికి హంటా వైరస్ సోకదు...

గుడ్ న్యూస్.. కరోనాలా హంటా వైరస్ కాదట... అసలు నిజమిదే.!
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 25, 2020 | 7:51 PM

COVID 19: కరోనా వైరస్‌తో ప్రపంచమంతా వణికిపోతుంటే కొత్తగా హంటా వైరస్ వచ్చిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ వైరస్ కూడా ప్రజలను చంపేస్తుందని పుకార్లు వస్తున్నాయి. అయితే అది నిజం కాదు. హంటా అనేది కేవలం ఎలుకల ద్వారా వచ్చేది మాత్రమే కానీ అంటువ్యాధి కాదు. ఎలుకలు తిన్న ఆహారాన్ని తినడం లేదా.. ఈ వైరస్ వచ్చిన ఎలుకలు మనుషుల్ని కొరకడం, ఎలుకల వ్యర్ధాలు తిన్నా ఈ వైరస్ పాకుతుంది. అంటే తప్ప అందరికి హంటా వైరస్ సోకదు.

కరోనా వైరస్ మహమ్మారితో ప్రపంచదేశాలు వణికిపోతుంటే చైనాలో మరో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వైరస్ మనుషుల్ని చంపేస్తుందని పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే అందులో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టమవుతోంది. హంటా వైరస్ అనేది కేవలం ఎలుకల ద్వారా వచ్చేది మాత్రమేనని.. అంటువ్యాధి కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తాజాగా ఈ వైరస్ బారిన పడి చైనాలో ఓ వ్యక్తి కూడా మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి సౌత్ వెస్ట్ చైనా నుంచి ఈస్ట్ చైనాలోని షాడోంగ్ ప్రావిన్స్‌కు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ బస్సులో ఉన్నా మిగతా 32 మందికి కూడా అధికారులు టెస్టులు నిర్వహిస్తున్నారని చైనా పత్రిక గ్లోబల్ టైమ్స్ న్యూస్ పేపర్ ప్రచురించింది.

ఈ వార్త నిన్న సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో.. యావత్ ప్రపంచం భయభ్రాంతులకు గురైంది. ఇప్పటికే కరోనా వైరస్ మహామ్మరితో ప్రపంచవ్యాప్తంగా 4,23,724 పాజిటివ్ కేసులు నమోదు కావడమే కాకుండా… 18,925 మంది ప్రాణాలు విడిచారు. ప్రస్తుతానికి 1,09,172 కోలుకోగా.. ఈ కోవిడ్ 19 వ్యాప్తి చెందకుండా ఉండేందుకు దాదాపు దేశాలన్నీ లాక్ డౌన్ ప్రకటించాయి. ఇక ఇప్పుడు కొత్త వైరస్ ఎలాంటి కల్లోలాన్ని సృష్టిస్తోందని అందరూ ఆందోళన చెందారు. ఇక ఈ హంటా వైరస్ గురించి భయపడాల్సిన అవసరం లేదని.. అంటువ్యాధి కాదని.. కేవలం ఎలుకల ద్వారానే వచ్చే వైరస్ అని స్పష్టమవుతోంది.

ఈ వైరస్ గురించి మాన్హాటన్‌కు చెందిన డాక్టర్ తానియా ఇలియట్ మాట్లాడుతూ.. చాలా ఏళ్ల కిందటి నుంచి హంటా వైరస్ ఉందని.. చైనాలో ఈ వైరస్ వల్ల ప్రతీ సంవత్సరం సుమారు 16,000 నుంచి 1,00,000 కేసులు నమోదవుతాయని అన్నారు. కరోనా వైరస్ మాదిరిగా ఇది ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సోకదని.. కేవలం ఎలుకల ద్వారానే సంక్రమిస్తుందని ఆమె అన్నారు. ఎలుకలు తిన్న ఆహారాన్ని తినడం లేదా.. ఈ వైరస్ వచ్చిన ఎలుకలు మనుషుల్ని కొరకడం, ఎలుకల వ్యర్ధాలు తిన్నా ఈ వైరస్ పాకుతుందే తప్పితే అందరికి సోకదని స్పష్టం చేశారు. హంటా వైరస్ కేసులు అమెరికాలో ఏమి లేవని ఆమె వెల్లడించారు.

హంటా వైరస్ అంటే ఏమిటి..?

ఈ వైరస్ ప్రధానంగా ఎలుక జాతి ద్వారా సంక్రమిస్తుంది. దీని వల్ల జనాల్లో అనేక వ్యాధులు వస్తాయి. అంతేకాకుండా ఈ వ్యాధి అంటువ్యాధి కాదు. కేవలం ఎలుకలు తిన్న ఆహారాన్ని తినడం లేదా.. ఈ వైరస్ వచ్చిన ఎలుకలు మనుషుల్ని కొరకడం, ఎలుకల వ్యర్ధాలు తిన్నా ఈ వైరస్ పాకుతుందే తప్పితే అందరికి సోకదు. అమెరికన్లలో హంటా వైరస్ సోకితే దాన్ని ‘న్యూ వరల్డ్’ హంటా వైరస్‌లు అంటారు. ఈ వ్యాధి వచ్చిన వాళ్లకు ఒళ్లు నొప్పులు, జ్వరం, దగ్గు, తలనొప్పి, శ్వాసలో ఇబ్బందులు ఎదుర్కోవడం వంటి లక్షణాలు ఉంటాయట. ఈ వ్యాధి ఎక్కువగా యూరోప్, ఆసియా ఖండాల్లో ఎక్కువగా వస్తుందట.

For More News:

ఏపీలో మరో కరోనా కేసు…

కొత్తగూడెం పోలీస్ అధికారి, వంట మనిషికి కరోనా.. 39కి చేరిన కేసులు..

ఇండియా లాక్ డౌన్.. ఏ సేవలకు బ్రేక్.? ఏవి ఉంటాయి.?

‘ఇంటికి రావద్దు ప్లీజ్’.. కరోనా అనుమానితుల ఇళ్లకు రెడ్ నోటిసులు..

కరోనా మరణ మృదంగం.. ప్రపంచవ్యాప్తంగా 18 వేలు దాటిన మరణాలు..

దేశంలో మొట్టమొదటి కోవిడ్ 19 ఆసుపత్రి.. రిలయన్స్ సంచలనం..

కేటీఅర్ అన్నా.. మా ఊరికి పంపండి.. సోదరి విజ్ఞప్తి..

జక్కన్న అదిరిపోయే ఉగాది ట్రీట్.. ‘ఆర్ఆర్ఆర్’ టైటిల్ లోగో విడుదల..

ఈ లక్షణాలు ఉన్నా.. కరోనా వైరస్ సోకినట్లే..!

ఇంటి అద్దెలు అడగొద్దు.. సీఎం విజ్ఞప్తి..