Breaking News
  • భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 31 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 131868. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 73560. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 54441. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 3867. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • కరోనా తెలంగాణా బులిటిన్. ఇవ్వాళ తాజాగా 41 పాజిటివ్ కేసులు నమోదు. మొత్తం రాష్ట్రంలో 1854 కరోనా పాజిటివ్ కేసులు . ఇవ్వాళ నలుగురు మృతి. మొత్తం ఇప్పటివరకు 53 మంది కరోనా కు బలి అయ్యారు. యాక్టీవ్ కేసులు 709 మంది చికిత్స పొందుతున్నారు.
  • తిరుమల: ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల రుసుము రీఫండ్. జూన్ 30వ తేది వరకు శ్రీవారి ఆర్జిత సేవలు, వీఐపీ దర్శన టికెట్లు, తిరుమలలో గదులు బుక్ చేసుకున్న భక్తులకు డబ్బులు రీఫండ్. టికెట్ల వివరాలను refunddesk_1@tirumala.org మెయిల్ ఐడీకి పంపాలని భక్తులను కోరిన టీటీడీ.
  • వరంగల్ 9 మర్డర్ కేసు లో సంచలన బ్రేకింగ్ . 9 మందిని హత్య చేసింది సంజయ్ . మాక్సుద్ భార్య చెల్లెలి తో సంబంధం ఉన్న సంజయ్. మాక్సుద్ భార్య చెల్లలి తో అక్రమ సంబంధం ఉన్న సంజయ్. తనకు అడ్డు రావొద్దని మాక్సుద్ కుటుంబం తో పాటు సన్నిహితంగా ఉన్న బిహారి యువకులను హత్య చేసిన సంజయ్.
  • CRPF జవాన్ లకు కరోనా పాజిటివ్. ఈ రోజు 9 మంది CRPF జవాన్ కి కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరించిన వైద్యులు. దేశ వ్యాప్తంగా మొత్తం 359 CRPF సిబ్బందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరణ. 137 యాక్టీవ్ కేస్ లు. 220 మంది డిశ్చార్జ్, ఇద్దరు మృతి.
  • దేశ వ్యాప్తంగా భానుడి భగ భగ. పంజాబ్, హర్యానా, దక్షిణ యుపి, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, తీరప్రాంత ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉంటాయని IMD హెచ్చరిక.. రాబోయే 5 రోజుల్లో తీవ్రమైన హీట్ వేవ్ ఉంటాయని హెచ్చరిక.

Coronavirus: ఈ లక్షణాలు ఉన్నా.. కరోనా వైరస్ సోకినట్లే..!

కరోనా పేషంట్లలో జలుబు, జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు సహజ లక్షణాలుగా కనిపిస్తాయన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ఈ లిస్టులోకి కొత్తగా రెండు లక్షణాలు చేర్చారు బ్రిటిష్ శాస్త్రవేత్తలు. బ్రిటన్‌కు చెందిన చెవి, ముక్కు, గొంతు డాక్టర్ల  అధ్యయనంలో కరోనా పేషంట్లలలో పై లక్షణాలే కాకుండా మరో రెండు కొత్త వాటిని గుర్తించారు.
Coronavirus, Coronavirus: ఈ లక్షణాలు ఉన్నా.. కరోనా వైరస్ సోకినట్లే..!

Coronavirus: ప్రస్తుతం ప్రపంచదేశాలను కరోనా వైరస్ మహమ్మారి గజగజలాడిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 18 వేల మంది ఈ వ్యాధి బారిన పడి మృతి చెందగా.. ఆ సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే కరోనా పేషంట్లలో జలుబు, జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు సహజ లక్షణాలుగా కనిపిస్తాయన్న సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు తాజాగా ఈ లిస్టులోకి కొత్తగా రెండు లక్షణాలు చేర్చారు బ్రిటిష్ శాస్త్రవేత్తలు. బ్రిటన్‌కు చెందిన చెవి, ముక్కు, గొంతు డాక్టర్ల  అధ్యయనంలో కరోనా పేషంట్లలలో పై లక్షణాలే కాకుండా మరో రెండు కొత్త వాటిని గుర్తించారు. వాసనలు పసిగట్టలేకపోవడం, రుచి చూడలేకపోవడం వంటివి కూడా కోవిడ్ 19 సోకిన బాధితుల్లో కనిపించాయని వారు చెబుతున్నారు.

దీనిపై బ్రిటన్‌కు చెందిన శాస్త్రవేత్త హాప్‌కిన్స్ మాట్లాడుతూ.. తాజాగా కరోనా వైరస్ బారిన పడిన వారిపై రీసెర్చ్ చేయగా.. వాసనలు పసిగట్టలేకపోవడం, రుచి చూడలేకపోవడం వంటి లక్షణాలను గుర్తించామని అన్నారు. ఇరాన్, దక్షిణ కొరియా, చైనా, ఇటలీలలో ఈ వ్యాధి సోకిన వారిని టెస్ట్ చేసినప్పుడు ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయని చెప్పుకొచ్చారు. అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మాత్రం ఇంతవరకు దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదని అన్నారు. అంతేకాకుండా ఈ విషయాన్ని వారు కొట్టిపారేయలేదని కూడా స్పష్టం చేశారు.

For More News:

ఏపీలో మరో కరోనా కేసు…

కొత్తగూడెం పోలీస్ అధికారి, వంట మనిషికి కరోనా.. 39కి చేరిన కేసులు..

ఇండియా లాక్ డౌన్.. ఏ సేవలకు బ్రేక్.? ఏవి ఉంటాయి.?

‘ఇంటికి రావద్దు ప్లీజ్’.. కరోనా అనుమానితుల ఇళ్లకు రెడ్ నోటిసులు..

కరోనా మరణ మృదంగం.. ప్రపంచవ్యాప్తంగా 18 వేలు దాటిన మరణాలు..

దేశంలో మొట్టమొదటి కోవిడ్ 19 ఆసుపత్రి.. రిలయన్స్ సంచలనం..

కేటీఅర్ అన్నా.. మా ఊరికి పంపండి.. సోదరి విజ్ఞప్తి..

జక్కన్న అదిరిపోయే ఉగాది ట్రీట్.. ‘ఆర్ఆర్ఆర్’ టైటిల్ లోగో విడుదల..

గుడ్ న్యూస్.. కరోనాలా హంటా వైరస్ కాదట… అసలు నిజమిదే.!

Related Tags