ఆన్‌లైన్ షాపింగ్ మాల్.. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ నిలిపివేత..!
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాపిస్తుండటంతో.. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలైన.. ఫ్లిప్ కార్ట్, అమెజాన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా వైరస్ వేగంగా ప్రబలుతుండటంతో.. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ తమ సర్వీసులను నిలిపివేశాయి. అయితే అమెజాన్ మాత్రం.. పలు చోట్ల కేవలం శానిటైజేషన్‌కు సంబంధించినవి సప్లై చేస్తున్నట్లు పేర్కొంది. కాగా.. వినియోగదారుల అవసరాలను తీర్చడమే తమ ప్రథమ ప్రాధాన్యత అని.. సాధ్యమైనంత త్వరలో మళ్లీ మీ ముందుకు వస్తామని హామీ ఇస్తున్నామంటూ ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ప్రస్తుతం కరోనా […]

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాపిస్తుండటంతో.. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలైన.. ఫ్లిప్ కార్ట్, అమెజాన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా వైరస్ వేగంగా ప్రబలుతుండటంతో.. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ తమ సర్వీసులను నిలిపివేశాయి. అయితే అమెజాన్ మాత్రం.. పలు చోట్ల కేవలం శానిటైజేషన్‌కు సంబంధించినవి సప్లై చేస్తున్నట్లు పేర్కొంది. కాగా.. వినియోగదారుల అవసరాలను తీర్చడమే తమ ప్రథమ ప్రాధాన్యత అని.. సాధ్యమైనంత త్వరలో మళ్లీ మీ ముందుకు వస్తామని హామీ ఇస్తున్నామంటూ ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ప్రస్తుతం కరోనా ప్రభావంతో అంతా కష్ట కాలంలో ఉన్నామని.. అందరూ సురక్షితంగా ఉందాం. తద్వారా జాతికి సాయ పడదాం. ఇంట్లోనే ఉంటూ మనల్ని మనల్ని కాపాడుకుందామంటూ ఓ ప్రకటన జారీ చేసింది.
కాగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే 18 వేల వరకు ప్రాణాలు కోల్పోగా.. దాదాపు నాలుగున్నర లక్షల మంది కరోనా బారినపడి చికిత్స పొందుతున్నారు. మన దేశంలో కూడా రోజురోజుకు పాజిటివ్ కేసుల నమోదు పెరుగుతుండటంతో.. పరిస్థితులు అదుపుతప్పుతున్నాయి. దీంతో 21 రోజులపాటు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.
E-Commerce website Flipkart temporarily suspends its services. #COVID19 #21daysLockdown pic.twitter.com/Ijk9j02j5m
— ANI (@ANI) March 25, 2020



