AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోన్న ఈ చిన్న గ్రామం గురించి తెలుసుకోవాల్సిందే..

ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటిని వణికిస్తున్న కరోనా గురించి తెలిసిందే. ఇప్పటికే దీని బారినపడి 18 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. మరో నాలుగున్నర లక్షల మంది వైరస్ సోకి ఆస్పత్రి పాలయ్యారు. ఇక మనదేశంలో కూడా ఈ మహమ్మారి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఇప్పటికే 600 వరకు పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. పది మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంది. మూడు వారాల […]

ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోన్న ఈ చిన్న గ్రామం గురించి తెలుసుకోవాల్సిందే..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 26, 2020 | 8:07 AM

Share

ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటిని వణికిస్తున్న కరోనా గురించి తెలిసిందే. ఇప్పటికే దీని బారినపడి 18 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. మరో నాలుగున్నర లక్షల మంది వైరస్ సోకి ఆస్పత్రి పాలయ్యారు. ఇక మనదేశంలో కూడా ఈ మహమ్మారి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఇప్పటికే 600 వరకు పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. పది మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంది. మూడు వారాల పాటు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించింది. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా అన్ని విమాన సర్వీసులు, రైళ్లు, బస్సులు, ప్రైవేట్ వాహనాలు నిలిచిపోయాయి. కేవలం అత్యవసరమయ్యే వాటికి మాత్రమే మినహాయింపునిచ్చారు.

అయితే ఈ మహమ్మారిని ఎదుర్కోవాలంటే.. సెల్ఫ్ ఐసోలేషన్ అనేది ఎంతో ముఖ్యం. ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంటూ.. ఈ వైరస్ బారిన పడకుండా తమను తాము రక్షించుకోవాల్సిందే. అయితే ఇలా చేయని కారణంగానే అనేక దేశాలు ఇప్పుడు కరోనా బారినపడి విలవిల్లాడుతున్నాయి. అయితే తాజాగా మన దేశంలోని ఓ గ్రామం ప్రపంచ దేశాలన్నింటికి ఆదర్శంగా నిలుస్తోంది. కరోనా వైరస్ కట్టడికి స్వచ్ఛందంగా సెల్ఫ్ ఐసోలేషన్ విధించుకొంది మహారాష్ట్రలోని ముంబై నగరం సమీపంలోని చిన్న ద్వీపమైన పంజూ గ్రామం. థానే జిల్లాలోని వాసాయి మండల పరిధిలో ఉంటుంది ఈ పంజూ గ్రామం. ఇది ఓ చిన్న దీవి. ఇక్కడి గ్రామంలో మొత్తం 1400 మంది జనాభా ఉంటారు. గ్రామం మొత్తం పచ్చని పంట పొలాలతో.. కలకలలాడుతూ ఉంటుంది. ఇక్కడి ప్రజలకు వ్యవసాయమే ప్రధాన వృత్తి. దీంతో ఈ గ్రామంలో రైతు కూలీలు ఎక్కువగా ఉంటారు. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో.. ఆ గ్రామంలోని రైతు కూలీలం పనులు సైతం మానుకొని సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లారు.

అంతేకాదు.. ఆ గ్రామస్థులు ఇతరులను కూడా ఎవ్వర్ని రానివ్వడం లేదు. గ్రామంలోకి పర్యాటకులు ఎవరూ రాకుండా నిషేధం విధించినట్లు ఆ గ్రామ సర్పంచ్ తెలిపారు. ఈ పంజూ నుంచి నైగావ్ సబర్బన్‌కు వెళ్లాలంటే పడవ మార్గం ఒకటే ఉంది. అయితే కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో..పడవల రాకపోకలను కూడా నిలిపివేశారు. మొత్తానికి మహారాష్ట్రలో కరోనా వ్యాపిస్తోన్న తరుణంలో.. ఇలా ఓ చిన్న గ్రామం మొత్తం సెల్ఫ్ ఐసోలేషన్ వెళ్లి.. అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.

Follow Us
ఓటీటీలో ట్రెండ్ అవుతున్న సినిమా..
ఓటీటీలో ట్రెండ్ అవుతున్న సినిమా..
సగం ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్.. ఈ సూపర్ స్కీమ్‌తో రూ.40 వేలకే..
సగం ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్.. ఈ సూపర్ స్కీమ్‌తో రూ.40 వేలకే..
మీ పాదాల ఆకారాన్ని బట్టి.. మీ క్యారెక్టర్ ఎలాంటిదో తెలుసుకోవచ్చు
మీ పాదాల ఆకారాన్ని బట్టి.. మీ క్యారెక్టర్ ఎలాంటిదో తెలుసుకోవచ్చు
వాట్సప్‌లో ఫోన్ నెంబర్ కనిపించకుండా ఎలా సెట్ చేసుకోవాలి..?
వాట్సప్‌లో ఫోన్ నెంబర్ కనిపించకుండా ఎలా సెట్ చేసుకోవాలి..?
ఒక దశలో చిరంజీవి, బాలకృష్ణ వంటి అగ్ర హీరోలకు గట్టి పోటీ
ఒక దశలో చిరంజీవి, బాలకృష్ణ వంటి అగ్ర హీరోలకు గట్టి పోటీ
ఇంట్లో వింత శబ్దాలు.. ఏంటా అని చూస్తే గుండె ఆగినంత పనైంది..
ఇంట్లో వింత శబ్దాలు.. ఏంటా అని చూస్తే గుండె ఆగినంత పనైంది..
స్కూల్ నుంచి రాగానే పిల్లలకు ఈ హెల్తీ స్టార్టర్ ఇస్తే ఎగిరి గంతే
స్కూల్ నుంచి రాగానే పిల్లలకు ఈ హెల్తీ స్టార్టర్ ఇస్తే ఎగిరి గంతే
ఎండాకాలంలో బాడీకి కూలింగ్ ఇచ్చే పుచ్చకాయ రైస్ రెసిపీ
ఎండాకాలంలో బాడీకి కూలింగ్ ఇచ్చే పుచ్చకాయ రైస్ రెసిపీ
అంతుచిక్కని అద్భుతాలకు నిలయం.. శ్రీరంగం టెంపుల్ మిస్టరీ..
అంతుచిక్కని అద్భుతాలకు నిలయం.. శ్రీరంగం టెంపుల్ మిస్టరీ..
ఓరి దేవుడో.. మీ ఇంట్లోని సబ్బులు, షాంపూలే మీకు శత్రువులా..ఈ విషయం
ఓరి దేవుడో.. మీ ఇంట్లోని సబ్బులు, షాంపూలే మీకు శత్రువులా..ఈ విషయం