Video: లండన్ వీధుల్లో కోహ్లీ బాడీగార్డ్ అహంకారం.. మీడియా ప్రతినిధిపై బూతు పురాణం..!
Virat Kohli Bodyguard Controversy: అభిమానులు, మీడియా ఇచ్చే మద్దతు వల్లే ఆటగాళ్లు స్టార్ సెలబ్రిటీలుగా చలామణి అవుతారు. అలాంటిది నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తులను పక్కన పెట్టుకుని, సమాజానికి ఐనా అద్దం పట్టే మీడియాపైనే ఇలాంటి దాడులకు దిగడం ఎంతవరకు సమంజసమని క్రీడాభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ సున్నితమైన అంశంపై బీసీసీఐ ఎంత త్వరగా స్పందించి కఠిన చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

Virat Kohli Bodyguard Controversy: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చుట్టూ ఇప్పుడు ఒక కొత్త వివాదం ముసురుకుంది. మైదానంలో అతని ఆటతీరు సంగతి పక్కన పెడితే, లండన్ వీధుల్లో అతని వ్యక్తిగత రక్షణ సిబ్బంది (బాడీగార్డ్) వ్యవహరించిన తీరు క్రీడా వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. విధి నిర్వహణలో ఉన్న ఒక భారతీయ క్రీడా జర్నలిస్టుపై సదరు బాడీగార్డ్ అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా, అసభ్య పదజాలంతో దూషించడం ఇప్పుడు పెద్ద వివాదానికి దారి తీసింది.
అసలు లండన్‌లో ఏం జరిగింది?
భారత్, ఇంగ్లండ్ వన్డే సిరీస్ కవరేజ్ కోసం లండన్ వెళ్లిన ప్రముఖ భారతీయ క్రీడా జర్నలిస్టులు ఈ షాకింగ్ ఘటనను సామాజిక మాధ్యమాల ద్వారా వెలుగులోకి తెచ్చారు. భారత జట్టు బస చేసిన హోటల్ వెలుపల, ఆటగాళ్లు బస్సు ఎక్కుతున్న సమయంలో విజువల్స్ తీస్తున్న ఒక మీడియా ప్రతినిధిపై కోహ్లీ బాడీగార్డ్ విరుచుకుపడ్డాడు. సదరు జర్నలిస్టు అధికారిక మీడియా గుర్తింపు కార్డు కలిగి ఉండి, భద్రతా సిబ్బంది కేటాయించిన నిర్ణీత స్థలంలోనే నిలబడి తన పని చేసుకుంటున్నాడు. విరాట్ కోహ్లీ బస్సు ఎక్కిన వెంటనే, ఈ బాడీగార్డ్ సదరు జర్నలిస్టు వైపు దూసుకొచ్చి అత్యంత అనాగరికంగా ప్రవర్తించాడు.
కార్డు చూపిస్తున్నా ఆగని బూతు పురాణం..!
भारतीय वनडे टीम के एक खिलाड़ी के साथ चलने वाला या बॉडीगार्ड वहां गई मीडिया के साथ लगातार बदतमीज़ी कर रहा है। टी20 टीम के साथ ये बॉडीगार्ड नहीं था। पहले भी मीडिया के साथ बदतमीज़ी कर चुके इस बॉडीगार्ड ने मीडिया मैनेजर के कहने पर अपनी निर्धारित जगह पर खड़े एक मीडियाकर्मी को फक ऑफ,… pic.twitter.com/FuupDwr2zP
— Abhishek Tripathi / अभिषेक त्रिपाठी (@abhishereporter) July 15, 2026
బాధిత జర్నలిస్టు తన వద్ద ఉన్న అధికారిక అనుమతి పత్రాన్ని, ఐడీ కార్డును చూపించినప్పటికీ ఆ బాడీగార్డ్ ఏమాత్రం తగ్గలేదు. “నాకు నీ కార్డుతో పని లేదు, ఇక్కడి నుంచి వెంటనే దఫా అవ్వు” అంటూ కెమెరా ముందే అత్యంత గలీజుగా బూతులు తిడుతూ బెదిరింపులకు దిగాడు. అక్కడే ఉన్న ఇతర అభిమానుల ముందు ఒక జర్నలిస్టును అంతలా అవమానించడం చూసి తోటి మీడియా ప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ బాడీగార్డ్ గతంలోనూ ప్రెస్ మీట్ల వద్ద, విమానాశ్రయాల్లోనూ మీడియా ప్రతినిధులతో ఇలాగే దురుసుగా ప్రవర్తించాడనే ఆరోపణలు ఉన్నాయి.
అసలు వ్యక్తిగత బాడీగార్డ్‌కు అనుమతి ఉందా? బీసీసీఐ రూల్స్ ఏం చెబుతున్నాయి?
This is Virat Kohli’s bodyguard. He has been seen with him for the first time in this ODI series. Usually, when you’re with the BCCI, you don’t need a personal bodyguard. In India, there is separate security during matches, and when the team is abroad, the host cricket board also… https://t.co/ZIhTs3cU0M pic.twitter.com/A0Qzy6lNCI
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) July 15, 2026
ఈ వివాదం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో క్రికెట్ అభిమానులు, జర్నలిస్టు సంఘాలు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిబంధనలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. సాధారణంగా బీసీసీఐ నిబంధనల ప్రకారం.. విదేశీ పర్యటనల్లో ఉన్నప్పుడు కేంద్ర ఒప్పందం కలిగిన ఏ ఆటగాడూ తనతో పాటు వ్యక్తిగత సిబ్బందిని లేదా ప్రైవేట్ భద్రతా సిబ్బందిని ఉంచుకోకూడదు. టీమిండియా ఆటగాళ్లకు స్థానిక క్రికెట్ బోర్డు, బీసీసీఐ అధికారిక భద్రతను కల్పిస్తాయి. మరి అలాంటప్పుడు విరాట్ కోహ్లీ తన వ్యక్తిగత బాడీగార్డ్‌ను లండన్ పర్యటనకు ఎలా తీసుకెళ్లాడనేది ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది. నిబంధనలను ఉల్లంఘించినందుకు సదరు బాడీగార్డ్‌ను వెంటనే పర్యటన నుంచి తొలగించి, కోహ్లీపై కూడా అంతర్గత విచారణ జరపాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




