ఆసుపత్రుల్లోని గాలిలో కరోనా వైరస్.. సీసీఎంబీ రీసెర్చ్‌లో సంచలన విషయాలు వెల్లడి.!

Coronavirus In Hospital Air: కరోనా వైరస్‌పై సీసీఎంబీ తాజాగా జరిపిన రీసెర్చ్‌లో పలు సంచలన విషయాలు బయటపడ్డాయి. తాజాగా హైదరాబాద్..

  • Ravi Kiran
  • Publish Date - 6:44 pm, Tue, 5 January 21
ఆసుపత్రుల్లోని గాలిలో కరోనా వైరస్.. సీసీఎంబీ రీసెర్చ్‌లో సంచలన విషయాలు వెల్లడి.!

Coronavirus In Hospital Air: కరోనా వైరస్‌పై సీసీఎంబీ తాజాగా జరిపిన రీసెర్చ్‌లో పలు సంచలన విషయాలు బయటపడ్డాయి. తాజాగా హైదరాబాద్, మొహలీలోని పలు హాస్పిటల్స్‌లో సీసీఎంబీ ప్రయోగాలు చేపట్టగా.. చాలా ఆసుపత్రుల్లోని గాలిలో కరోనా వైరస్ ఉందని తేలింది. ఇదిలా ఉంటే కోవిడ్‌ బాధితులు ఆసుపత్రుల్లో గడిపే సమయాన్ని బట్టి గాల్లో వైరస్‌ ఉంటుందని సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా స్పష్టం చేశారు. అయితే ఈ విషయంపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడంతో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయొచ్చని ఆయన తెలిపారు.

కాగా, భారత్‌లో వ్యాక్సిన్‌ పంపిణీపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈనెల 13వ తేదీ నుంచి దేశంలో వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభమవుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇక ఇప్పటికే డీసీజీఐ కోవాగ్జిన్‌తో పాటు కోవిషీల్డ్‌ వ్యాక్సిన్లకు అత్యవసర వినియోగానికి అనుమతిచ్చిన విషయం విదితమే.

Also Read:

వాహనదారులకు అలెర్ట్.. ఇకపై హెల్మెట్ ధరించకపోతే బైక్ స్వాధీనం.. అమలులోకి వచ్చిన కొత్త రూల్.!

జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. రామతీర్ధం ఘటనపై సీఐడీ విచారణకు ఆదేశం..

కోవిషీల్డ్ వ్యాక్సిన్.. కేంద్రం అనుమతిస్తే.. ఒక్కో డోస్ రూ. 1000: సీరం సంస్థ చీఫ్