Rama Theertham Incident: జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. రామతీర్ధం ఘటనపై సీఐడీ విచారణకు ఆదేశం..
Rama Theertham Incident: ఆంధ్రప్రదేశ్‌లోని రామతీర్ధం దేవుని విగ్రహం ధ్వంసం ఘటన పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో..

Rama Theertham Incident: రామతీర్థంలో శ్రీరాముని విగ్రహం ధ్వంసం ఘటనపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఘటనపై సీఐడీ సిచరణకు ఆదేశాలు జారీ చేసింది. రామతీర్ధం ఘటనకు కారకులైన దోషులను రెండు రోజుల్లో అరెస్ట్ చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. అలాగే నెల రోజుల్లో రామతీర్ధం ఆలయాన్ని ఆధునీకరిస్తామని అన్నారు. అటు రాజమండ్రి ఘటనపైనా సీఐడీ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 24 వేల దేవాలయాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది.