Chiranjeevi: నిజంగా అవకాశం వస్తే ఆ బిల్డింగ్‌ను భూస్థాపితం చేస్తా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మెగాస్టార్..
అక్కినేని కోడలు సమంత ఓటీటీ వేదిక అయిన ఆహాలో సామ్ జామ్ కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ షోలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొని తన జీవితంలోని
అక్కినేని కోడలు సమంత ఓటీటీ వేదిక అయిన ఆహాలో సామ్ జామ్ కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ షోలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొని తన జీవితంలోని అనుభవాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. అయితే ఇందులో మీకు జీవితంలో వెనక్కి వెళ్ళే అవకాశం వస్తే మీరు దేన్ని మార్చాలనుకుంటున్నారు ? అని సమంత ప్రశ్నించగా.. మెగాస్టార్ ఆసక్తికర సమాధానం చెప్పారు.
సమంత అడిగిన ప్రశ్నకు మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ.. “ఒకవేళ నిజంగానే ఆ అవకాశం వస్తే.. సరిగ్గా ఒక సంవత్సరం వెనక్కి వెళ్ళి చైనాలో కరోనా వైరస్ లీక్ అయిన బిల్డింగ్‌ను భూస్థాపితం చేసి ఆ వైరస్‌ను బయటకు రాకుండా చేయాలనేది నా కోరిక” అని చెప్పారు. ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిసిస్తున్నారు. ఈ మూవీని మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్, కొణిదెల ప్రొడెక్షన్ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా హీరో రామ్ చరణ్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆ తర్వాత లూసిఫర్ రిమేక్‌లో నటించనున్నారు.
సామ్ జామ్ షోలో మెగాస్టార్ చిరంజీవి..